అందాల తార అనుష్కా శెట్టి. తెలుగులో ఆమె నటించిన చిత్రాలు అన్ని ఒక ఎత్తు. బాహుబలి మరో ఎత్తు. అందులో ప్రభాస్ కి జోడీగా అనుష్క మైమరపించే నటనను చూపించింది. నటన, అందం ఈ రెండూ కలబోసిన తారలు బహు అరుదు. మరి అనుష్కలో ఈ రెండూ ఉన్నాయి. బాహుబలి 2 తరువాత అనుష్క భాగ‌మతి మాత్రమే విడుదల అయింది. అది కూడా హిట్ మూవీ. ఆ తరువాత అనుష్క కొత్త చిత్రం ఊసే లేదు. ఎందుచేత.?



అనుష్క పెళ్ళి  కూతురుగా కొత్త పాత్రలోకి మారబోతోందా. అందువల్లనే ఆమె లేటెస్ట్ గా ఏ మూవీకి ఒప్పుకోవడంలేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి చిరంజీవి సైరా మూవీ తరువాత చేయబోయే చిత్రానికి అనుష్కనే హీరోయిన్ అనుకున్నారు. అయితే అది కూడా నిజం కాదని తేలిపోయింది. చేతిలో న్యూ ప్రాజెక్ట్ ఏదీ లేదు. మరి అనుక్ష అందాలను తెర మీద ఇంక చూడలేమా.



ఆమె వయసు రేపు నవంబర్ నాటికి అక్షరాల 37 ఏళ్ళు. నవంబర్ 7 1981 అనుక్ష డేట్ ఆఫ్ బర్త్. ఆ విధంగా చూసుకున్నపుడు స్వీటీ బేబీ పెళ్ళి చేసుకుని గ్రుహిణి పాత్రకే పరిమితం అవుతుందని టాక్ నడుస్తోంది. అందువల్లనే ఆమె మరే చిత్రానికీ సైన్ చేయడం లేదని అంటున్నారు.



ఇంకో కారణాన్ని చెబుతున్నారు. ఆమె మిగిలిన నటీమణుల్లా యువ హీరోలకు సూట్ కావడం లేదని అందువల్లనే పక్కన పెడుతున్నారని అంటున్నారు. అనుష్కతోనే  మూవీస్ లోకి ఎంటరైన సీనియర్ హీరోయిన్లు శ్రియ, నయనతార ఇప్పటికీ రాణిస్తున్నారు. శ్రియ అయితే పెళ్ళి అయిన తరువాత కూడా అందాల ఆరబోత చేస్తోంది. నయన్ కొత్త అందంతో ఎప్పటికపుడు తెర ముందుకు వస్తోంది.
 మరి వారితో పాటే ఎంటరైన అనుస్ఖ మాత్రం పెద్ద దానిలా కనిపించడం వల్లనే యూత్ హీరోల పక్కన బెస్ట్ చాయిస్ అవడం లేదని అంటున్నారు.


ఇవన్ని ఎలాగున్నా అనుష్క కొత్త చిత్రం మాత్రం లేదన్నది ష్యూర్. ఆమె పెళ్ళి ముచ్చట త్వరలోనే ఉంటుందని కూడా అంటున్నారు. వీటిపై స్వీటీయే పెదవి విప్పి అన్ని చెబుతుందంట. అప్పటివరకూ అన్నీ గాసీప్పులే.



మరింత సమాచారం తెలుసుకోండి: