ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. ఎన్.టి.ఆర్ పక్కన పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమకు తమన్ మ్యూజిక్ అందించాడు. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న ఈ సినిమా ట్రైలర్ నందమూరి ఫ్యాన్స్ ను అలరించింది.


అయితే ట్రైలర్ తీక్షణంగా చూస్తే ఏదైతే త్రివిక్రం మొన్నామధ్య ఇంటర్వ్యూలో చెప్పాడో ఆ విషయమే మరోసారి గుర్తుచేసుకోవాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఓ కథ సిద్ధం చేశాడట. రుస్తుం టైటిల్ తో ఆ సినిమా చేయాలని అనుకున్నారు. ఫ్యాక్షనిజం మూలం ఎలా మొదలైంది అన్న విధంగా ఆ కథ ఉంటుందట.


రుస్తుం కథకు తీసుకున్న రిఫరెన్స్ తోనే అరవింద సమేత కథ రాసుకున్నానని అప్పట్లో త్రివిక్రం చెప్పాడు. అయితే ట్రైలర్ చూస్తే ఒక క్యారక్టర్ తో కథ థీం చూపించాడు త్రివిక్రం. 20 ఏళ్ల క్రితం మీ తాత కత్తి పట్టాడు అంటే అది అవసరం.. అదే కత్తి మీ నాయనెత్తినాడంటే అది వారసత్వం.. అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం. ఆ కత్తి నీ బిడ్డనాటికి లోపమైతందా అంటూ అద్భుతమైన డైలాగ్ రాశాడు త్రివిక్రం.


ఈ డైలాగ్ వింటే కచ్చితంగా ఫ్యాక్షనిజం అసలు ఎలా మొదలైంది అన్న రిఫరెన్స్ తో కత్తికి కత్తి సమాధానం ఎలా అయ్యింది అన్నట్టుగా కథ రాసుకున్నాడని తెలుస్తుంది. సినిమా కథగా అనిపిస్తున్న సీమ పొరుషాన్ని చూపించే సినిమాగా అరవింద సమేత వస్తుంది. కత్తి పట్టి రికార్డుల వేట సాగించడం ఎన్.టి.ఆర్ కు కొత్తేమి కాదు మరి ఈ వీర రాఘవ విధ్వంసానికి ఎన్ని రికార్డులు మోకరిల్లుతాయో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: