జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణల మధ్య చాల గ్యాప్ ఏర్పడింది అంటూ కొన్ని సంవత్సరాలుగా వార్తలు హడావిడి చేసిన తరువాత హరికృష్ణ మరణంతో ఏర్పడ్డ విషాద పరిస్థుతులు వల్ల బాబాయ్ అబ్బాయ్ కలిసిపోయారు అని భావించారు అంతా. అంతేకాదు ‘అరవింద సమేత’ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కు బాలకృష్ణ అతిధిగా రాబోతున్నాడు అంటూ అప్పట్లో వార్తలు రావడంతో నందమూరి అభిమానులు అంతా జోష్ లోకి వెళ్ళిపోయారు.
Jr NTR becomes emotional while talking about his father at the trailer launch of Aravindha Sametha
అయితే మూడురోజుల క్రితం జరిగిన ‘అరవింద సమేత’ ఫంక్షన్ కు బాలకృష్ణ అతిధిగా రాకపోవడంతో బాలయ్య జూనియర్ ల మధ్య ఆగ్యాప్ అలాగే కొనసాగుతోందా అన్న అనుమానాలు మళ్ళీ మొదలయ్యాయి. ఇదిచాలదు అన్నట్లుగా ‘అరవింద’ ఫంక్షన్ లో జూనియర్ త్రివిక్రమ్ ను విపరీతంగా పొగుడ్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు బాలకృష్ణ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నట్లు టాక్. 

తనతండ్రి హరికృష్ణ మరణం తరువాత త్రివిక్రమ్ తనకు అన్నివిధాలా అండగా ఉన్నాడని ఒక విధంగా త్రివిక్రమ్ తనకు సోల్ మేట్ అంటూ ఉద్వేగంతో జూనియర్ కామెంట్స్ బాలకృష్ణ అభిమానులకు విపరీతమైన కోపాన్ని తెప్పిస్తున్నాయి. త్రివిక్రమ్ గురించి అన్నిమాటలు మాట్లాడిన జూనియర్ హరికృష్ణ మరణం తరువాత జూనియర్ కళ్యాణ్ రామ్ ల పక్కనే నిలబడి అన్ని పనులు తానై నిర్వర్తించిన బాలకృష్ణ కనపరిచిన ప్రేమ జూనియర్ దృష్టికి రాలేదా అంటూ బాలయ్య అభిమానులు జూనియర్ పై అసహనంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. 
NTR Biopic First Poster: Nandamuri Balakrishna Is The Image Of NTR
ఇదిచాలదు అన్నట్లుగా బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ గురించి కానీ వరసపెట్టి విడుదల అవుతున్న బాలకృష్ణ లుక్ కు సంబంధించిన ఫోటోలు గురించి కానీ జూనియర్ తన ట్విట ర్ లో ఒకమాట కూడ అనలేనంత బిజీగా ఉన్నాడా అంటూ బాలయ్య అభిమానుల అసహనం. దీనికితోడు హరికృష్ణ మరణానికి ముందు జరిగిన మహేష్ చరణ్ ల పుట్టినరోజునాడు తన ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపిన జూనియర్ అప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి విడుదలైన బాలకృష్ణ లుక్ పై కనీసం ఒక్క ప్రశంస కూడ ఎందుకు చేయలేదు అని బాలయ్య అభిమానుల ప్రశ్న. దీనితో జూనియర్ చాల వ్యూహాత్మకంగా ఎన్టీఆర్ బయోపిక్ ను పట్టించుకొనట్లు ప్రవర్తిస్తూ తనకు తన బాబాయ్ కి ఏర్పడ్డ గ్యాప్ ఇంకా కొనసాగుతూనే ఉంది అని చెప్పే విధంగా జూనియర్ చర్యలు ఉన్నాయని బాలయ్య అభిమానుల వాదన..


మరింత సమాచారం తెలుసుకోండి: