ఈరోజు విడుదలైన ‘నోటా’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒకప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారసత్వ హీరోల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో వారసత్వం లేకుండా హీరో అవ్వడం చాల కష్టమా ? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈకామెంట్స్ చేసాడు.
Vijay Devarakonda

సినిమా అనేది ఒక బిజినెస్ అని బిజినెస్ లో ఎవరు ఎవరికీ అనవసరంగా డబ్బులు పెట్టరని నిర్మాత తాను పెట్టిన పెట్టుబడి బద్రత గురించి ఆలోచిస్తూ సినిమాలు తీస్తాడు అంటూ మధ్యలో వారసత్వ హీరోల పై తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. వారసత్వ హీరోల సినిమాలకు ఓపెనింగ్స్ బాగా వస్తాయని అదేవిధంగా ఆసినిమాల మార్కెట్ కు కూడ సమస్యలు ఉండవని చెపుతూ ఒకసారి సినిమా విడుదల అయ్యాక వచ్చే ప్రేక్షకుడి తీర్పు సునామీలో అందరు సమానమే అంటూ కామెంట్స్ చేసాడు.
vijay devarakonda will campaign on trs
అయితే ఇలాంటి వారసత్వ హీరోలు ఉన్న ఇండస్ట్రీలో తనలా ఎదిగే అవకాసం చాల తక్కువ మందికి మాత్రమే వస్తుందని అదికేవలం తన అదృష్టం అంటూ కామెంట్స్ చేసాడు విజయ్. ఇదేసందర్భంలో మరొక ట్విస్ట్ ఇస్తూ కష్టపడి చదివితే సివిల్ సర్వీస్ పరీక్షలో ఎంపిక అయ్యే అవకాసం ఉంది అంటూ ఎంత కష్టపడి సినిమా తీసినా ఆసినిమా ప్రేక్షకులు చూస్తారు అన్న గ్యారంటీ లేదు అంటూ ఫిలిం ఇండస్ట్రీలోని రిస్క్ ను మరొకసారి బయటపెట్టాడు విజయ్ దేవరకొండ. 
After Mahesh Babu, Vijay Devarakonda to play Chief Minister on the silver screen?
ఇదే సందర్భంలో విజయ్ మాట్లాడుతూ తాను వచ్చే ఎనికలలో ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తానని చెపుతూ తాను ‘నోటా’ పాత్రలో నటించిన ముఖ్యమంత్రి పాత్ర కోసం మంత్రి కేటిఆర్ బాడీ లాంగ్వేజ్ ని పూర్తిగా అనుసరించడమే కాకుండా ఆయన లాగే తాను కూడ తన డ్రెస్సింగ్ కోడ్ ను అనుసరించాను అంటూ కేటిఆర్ పై తనకు ఉన్న అభిమానాన్ని బయటపెట్టాడు. ఎంతోమంది రాజకీయ నాయకులు కేవలం ఫోటోల కోసం పరిపాలన చేస్తున్నారని అయితే తన దృష్టిలో నిజమైన నాయకుడు కేటిఆర్ అంటూ ఆయనలా ఉండాలన్న తన మనసులోని మాటను బయట పెడుతూ విజయ్ రానున్న ఎన్నికలలో తన అభిమానులను టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయమని పరోక్షంగా ప్రచారం మొదలు పెట్టేశాడు అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: