విజయ్ దేవరకొండ ‘నోటా’ కు సంబంధించిన ప్రీమియర్ షోలు అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో పూర్తి కావడంతో ఈమూవీ పై ఓవర్సీస్ ప్రేక్షకుల జడ్జిమెంట్ బయటకు వస్తోంది. ఈమూవీని చూసిన కొందరు ఓవర్సీస్ ప్రేక్షకులు బయట పెడుతున్న అభిప్రాయం ప్రకారం పట్టున్న కథనంతో ఫస్ట్ హాఫ్ సాగిందని రౌడీ సీఎంగా విజయ్ దేవరకొండ అదరగొడుతున్నాడు అంటూ అభిప్రాయలు వెల్లడిస్తున్నారు. 
NOTA teaser,Vijay Deverakonda,Vijay Deverakonda Movie
మరికొందరైతే ఈమూవీ సెకండ్ హాఫ్ డీసెంట్ గా ఉందని విజయ్ దేవరకొండ మరో విజయం ఖాయం అంటూ అభిప్రాయాలు లీక్ చేస్తున్నారు. అయితే ఈమూవీకి ప్రశంసలతో సమానంగా ఓవర్సీస్ ప్రేక్షకుల నుండి విమర్శలు కూడ అందుతున్నాయి. ఈమూవీ అంతా తమిళ ఫ్లేవర్ లో ఉందని విజయ్ దేవరకొండ కెరియర్ కు సంబంధించి ఇది ఎవరేజ్ సినిమా మాత్రమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

అంతేకాదు ఈమూవీ కథ విషయంలో విజయ్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ఈమూవీలో ఆకట్టుకునే సన్నివేశం ఏది లేదు అంటూ మరికొందరు ఓవర్సీస్ ప్రేక్షకులు పెదవి విరుస్తూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈమూవీలోని డైలాగ్స్ చాల బాగుండటంతో పాటు దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పరిస్థుతులకు అద్దం పట్టేలా ఉందని మరొకరి అభిప్రాయం. 

అయితే చాలామంది ఓవర్సీస్ ప్రేక్షకులు మాత్రం ఈమూవీ పొలిటికల్ మూవీస్ కు ఇష్టపడే వారికి మాత్రమే నచ్చుతుందని సగటు ప్రేక్షకుడుకి నచ్చడం కష్టం అని కామెంట్స్ చస్తూ సెకండ్ హాఫ్ కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తూ ఉండటంతో ‘నోటా’ కు డివైడ్ టాక్ వచ్చిందా అని అనిపించడం సహజం. అయితే విజయ్ దేవరకొండ మెహ్రీన్ ఫిర్జాదా మధ్య లవ్ కెమిస్ట్రీని దర్శకుడు కొత్తగా చూపించడంతో ఈమూవీ కొంత వరకు యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది అన్న అభిప్రాయం వ్యక్త పరుస్తున్నారు. యంగ్ డైరెక్టర్ ఆనంద్ శంకర్ చేసిన ఈ ‘నోటా’ ప్రయోగం మన తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ఎంత వరకు నచ్చింది అన్న విషయం ఈ సాయంత్రానికి తేలిపోతుంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: