మరో ఆరు రోజులలో ‘అరవింద సమేత’ విడుదల కాబోతూ ఉన్నా ఈమూవీకి సంబంధించిన ప్రమోషన్ ఇంకా ప్రారంభం అవ్వకపోవడం జూనియర్ అభిమానులను ఆశ్చర్య పరుస్తోంది. ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ సక్సస్ అయిన తరువాత మళ్ళీ ఈమూవీ ప్రమోషన్ విషయంలో కొంత నిశ్శబ్దం ఏర్పడటం వెనుక త్రివిక్రమ్ వ్యూహం ఉంది అని అంటున్నారు. 
Jr NTR
తెలుస్తున్న సమాచారం మేరకు ‘అరవింద సమేత’ ప్రమోషన్ విషయంలో భారీగా ఖర్చు చేయకుండా కొంత తగ్గించి ఈమూవీ పై విపరీతమైన అంచనాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని త్రివిక్రమ్ ఒక స్థిర నిర్ణయంలో ఉన్నట్లు సమాచారం. ‘అజ్ఞాతవాసి’ సినిమా విషయంలో ఆమూవీ పై పెరిగిన అంచనాలు చివరకు శాపంగా మారిన పరిస్థుతులలో అలాంటి తప్పుడు నిర్ణయాలు మళ్ళీ తీసుకోకూడదని త్రివిక్రమ్ ఆలోచన అని టాక్. 
Aravinda Sametha Veera Raghava trailer review
ఈ ఎత్తుగడతో ఇప్పటికే ‘అరవింద సమేత’ విషయంలో ఇంటర్వ్యూలు ఇమ్మని అనేక మీడియా సంస్థలు త్రివిక్రమ్ ను అడుగుతూ ఉన్నా సున్నితంగా తప్పించుకుని తిరుగుతున్నాడని తెలుస్తోంది. అంతేకాదు ఈసినిమాకు సంబంధించి యూనిట్ సభ్యులతో రికార్డ్ చేసిన రెండు వీడియోలను అన్ని ఛానల్స్ కు ఇవ్వడం జరుగుతుంది కానీ ఛానల్ దేనికి దానికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని త్రివిక్రమ్ స్ట్రాటజీ అని అంటున్నారు. 
Jr NTR Aravindha Sametha trailer
‘అరవింద సమేత’ రిజల్ట్ వచ్చిన తరువాత మాత్రమే ఈమూవీకి సంబంధించిన ప్రమోషన్ వేగం పెంచాలని అప్పటి వరకు ఇలా తక్కువ స్థాయిలోనే చేయాలని త్రివిక్రమ్ అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఈమూవీ టాక్ ఎలా వచ్చినా బయ్యర్లు నష్టపోకుండా మొదటి వారంలోనే ఇంచుమించు 70 శాతం పెట్టుబడి రికవర్ అయ్యేలా ఆంధ్రప్రదేశ్ లో ‘అరవింద సమేత’ టిక్కెట్ ను 200 రూపాయలకు తెలంగాణ రాష్ట్రంలో 120 రూపాయలకు పెంచి మొదటి మూడురోజుల్లోనే సంచలనాలు క్రియేట్ చేయాలని ఈమూవీ నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే అభ్యర్ధనలు ఇచ్చినట్లు సమాచారం..


మరింత సమాచారం తెలుసుకోండి: