తెలుగు ఇండస్ట్రీలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’ చిత్రం నుంచి వరుసగా విజయాలు అందుకుంటూ వచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.   జై లవకుశ చిత్రం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’లో నటిస్తున్నాడు.  ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి అయి పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉన్నారు.  ఈ మద్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా అయ్యింది.  రాయలసీమ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.  ఇక స్టార్ హీరోల చిత్రాలు రిలీజ్ అవుతున్నాయంటే..ఆ సందడే వేరు. 

తమ అభిమాన హీరో చిత్రం  మొదటి రోజే చూసేయాలన్న కసితో అభిమానులు మీద పడడం ఎంత సహజమో.. ఆ కసిని క్యాష్ గా మార్చుకోవాలని నిర్మాత - డిస్ట్రిబ్యూటర్లు ఆలోచించడం అంతే సహజం. రిలీజ్ టైమ్ లో తొలి వారం బాగా టిక్కెట్టు రేటు పెంచుకుని అమ్ముకునే వెసులు బాటు ఉంది. అందుకు ప్రభుత్వాలు సైతం జీవోలు ఇస్తున్నాయి.  దసరాకి భారీ బడ్జెట్ చిత్రం `అరవింద సమేత` రిలీజ్ కి రెడీ అవుతోంది. అక్టోబర్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది కాబట్టి తొలి వారం టిక్కెట్టు ధర పెంచుకుని అమ్ముకునేలా వెసులుబాటు కోసం ప్రయత్నిస్తున్నారట. ఏపీలో రూ.200 యూనిఫామ్ రేటు ఫిక్స్ చేయాలని ప్రభుత్వాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ కోరనున్నారట. 

ఇదిలా వుంటే నైజాం ఇలాంటి టికెట్ ల పెంపు వ్యవహారాలు తక్కువ. కానీ అరవిందను నైజాంకు కొన్న దిల్ రాజు ఇక్కడ కూడా వంద రూపాయలకు బదులు 120 రూపాయల యూనిఫారమ్ టికెట్ పెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణలో అసెంబ్లీ రద్దైన నేపథ్యంలో  ఇక్కడ అనుమతి ఆపద్ధర్మ ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాలా? కోర్టు నుంచి తెచ్చుకోవాలా? అన్నది క్లియర్ కావాల్సి వుంది.

అందుకే ప్రభుత్వ జీవోలు తెచ్చుకునేదెలా?  కోర్టులో సెటిల్ చేయడమెలా? అంటూ తెగ ఆలోచిస్తున్నారట. దాదాపు 93కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకున్న ఈ సనిమా తొలి వారంలోనే 100 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.  అరవింద సమేత వీరరాఘవను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ రేట్లకే విక్రయించారు. అందువల్ల వేగంగా రికవరీ కావాలంటే, ఇలా టికెట్ రేట్లు పెంచడం అన్నది బయ్యర్లకు తప్పదు.



మరింత సమాచారం తెలుసుకోండి: