బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తన వల్లే సూపర్ స్టార్ అయ్యాడని ప్రముఖ గాయకుడు అభిజీత్ భట్టాచార్య సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  బాలీవుడ్ లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన అభిజిత్ అప్పట్లో టివిలో కొన్ని ప్రైవేట్ ఆల్బామ్స్ తో బాగా పాపులర్ అయ్యాడు.  ముంబైలో జరిగిన ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో అభిజీత్ మాట్లాడుతూ..తన గొంతు అచ్చం షారూఖ్ లా ఉంటుందని..అందుకే తనకు సంబంధించిన పాటలు ఎక్కువగా నాతోనేపాడించే వాడని అన్నాడు.

అయితే ఎన్నో హిట్ సాంగ్స్ ఇచ్చిన తనను మాత్రం ఇప్పుడు లెక్కచేయడం లేదని పలు సందర్భాల్లో అవమానించాడని ఆరోపిస్తున్నాడు అభిజిత్.  అంతే కాదు తాను పాడుతున్నంత వరకూ షారుక్ ఖాన్ కెరీర్ దేదీప్యమానంగా వెలిగిపోయిందని అభిజీత్ భట్టాచార్య అన్నారు. ఒక్కసారి తాను పాడటం ఆపేయగానే కింగ్ ఖాన్ ఒక్కసారిగా డౌన్ అయిపోయాడని తెలిపారు. 

ఓ చిత్రం అయిపోయిన తర్వాత స్క్రీన్ పై చివరగా నా పేరు వేశారని..అలాంటి దుస్థితి తనకు మళ్లీ రాకూడదని కోరుకుంటున్నానని అన్నాడు. తనకు ఏమాత్రం మర్యాద ఇవ్వని వ్యక్తులతో కలిసి పనిచేయకూడదని అప్పుడే నిర్ణయించుకున్నానని అభిజీత్ చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: