తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య యంగ్ హీరోలు తమ సత్తా చాటుతున్నారు.  నేచురల్ స్టార్ నాని తర్వాత ఆ రేంజ్ లో వరుస విజయాలు అందుకుంటున్న హీరో విజయ్ దేవరకొండ.  పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం చిత్రాలతో వరుస విజయాలు తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ ఈ రోజు ‘నోటా’ చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చాడు.  తాజాగా ఈ రోజు రిలీజ్ అయిన ‘నోటా’ సినిమాతో విజయ్ తమిళంలో కూడా అడుగుపెట్టాడు.  ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విజయ్ దేవరకొండ పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.   

ప్రస్తుతం ప్రేక్షకుల్లో తనకు ఉన్న క్రేజ్ గురించి ఆలోచించే సమయం లేదని..ఇష్టపడే వారు ఇష్టపడుతూనే ఉంటారని అన్నారు.  తనకు వరుసగా ఛాన్స్ లు రావడంతో ప్రస్తుతం బిజీగా ఉన్నానని వ్యాఖ్యానించాడు. నోటా సినిమా ప్రమోషన్ లో భాగంగా చెన్నై, కొచ్చి, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ప్రచారం చేశానని విజయ్ చెప్పాడు.  అయితే నాని తో నటించిన ‘ఎవడే సుబ్రమాణ్యం’ చిత్రం తర్వాత తాను దర్శకత్వం, రచన ఫీల్డ్ లోకి వెళ్లాలని ప్రయత్నించానని..కానీ అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చి మంచి హిట్ చిత్రాలు దక్కాయని అన్నారు.   

తన పేరును ఇంగ్లిష్‌లో అనువదించి ‘కింగ్‌ ఆఫ్‌ ది హిల్‌’ అని సొంత ప్రొడక్షన్ సంస్థకు పేరు పెట్టిన్నట్లు విజయ్ దేవరకొండ తెలిపాడు. ఇండస్ట్రీలో మంచి స్క్రిప్టుని తీసుకొస్తే వస్తే..వాళ్లను తప్పకుండా ప్రోత్సహిస్తానని అన్నారు. ఇదే సందర్భంగా   ఓ విదేశీ యువతితో దిగిన పలు ఫొటోల విషయంపై కూడా విజయ్ స్పందించాడు. 

ఆ ఫోటోలోని అమ్మయి చాలా మంచిదని..అంత వరకు  చాలు అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.  కాగా, ఆ మద్య ల్జియం దేశానికి చెందిన ఓ యువతితో విజయ్ డేటింగ్  చేస్తున్నట్లు వార్తలు హల్ చల్ చేశాయి.  విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి మిలానే డిన్నర్ చేస్తున్న ఫొటో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: