తమిళ దర్శకుడు ప్రియదర్శిని దర్శకత్వంలో దివంగత తమిళ్ నాడు ముఖ్యమంత్రి అమ్మ జయలలిత పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ పై బయోపిక్ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రూపొందనుంది. జయలలిత బయోపిక్ మూవీ కి ఏ స్టోరీ ఆఫ్ రివల్యూషనరీ లీడర్ క్యాప్షన్ తో ది ఐరన్ లేడీ గా టైటిల్ నిర్ణయించారు. నిత్యా మీనన్ ఈ బయోపిక్ మూవీ లో జయలలిత క్యారెక్టర్ కు సెలెక్ట్ అయ్యారు.   కథలో విషయం వుంటే తప్ప ఆమె ఏ సినిమాకి ఓకే చెప్పదు. అందువల్లనే ఆమె సినిమాల సంఖ్య తక్కువగా కనిపించినా, వచ్చిన క్రేజ్ ఎక్కువ. వివిధ భాషల్లో ఆమె చేసిన ఆణిముత్యాల్లాంటి పాత్రలు ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. 

టాలీవుడ్, కోలీవుడ్ ల లో వన్ ఆఫ్ ది సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వెలుగొందిన జయలలిత,తమిళనాడు పాలిటిక్స్ లో ఎంటరయి,ముఖ్య మంత్రి పదవిని అధిష్టించి పేద ప్రజలకు అనేక పధకాలు అమలు చేసి, తమిళనాడు రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూరగొని అమ్మ గా పేరుపొందారు.  ఇదిలా ఉంటే..నిత్యా మీనన్ ఈ మద్య బాగా లావెక్కినట్లు..ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయని రూమర్లు వచ్చాయి. అయితే ఈ మాటలను నిత్యామీనన్ పెద్దగా పట్టించుకోవడం లేదు. అవసరమైతే పాత్ర కోసం సన్నబడగలను అనే ఆమె చెబుతున్నారు. 

తాజాగా జయలలిత బయోపిక్ విషయం గురించి మాట్లాడుతూ.. 'నేను లావు కావడం వలన అవకాశాలు రావడం లేదని అంటున్నారు .. ఇలా లావుగా ఉండటం వల్లనే కదా 'జయలలిత'గారి పాత్రను పోషించే గొప్ప అవకాశం దక్కింది' అంటూ నవ్వేశారు. లావు విషయం అలా ఉంచితే ఈ సినిమా నా కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనే బలమైన నమ్మకం మాత్రం వుంది' అని చెప్పుకొచ్చారు.    ఈ సినిమాపై ఎలాంటి వివాదం తలెత్తకుండా ఉండేందుకే నిత్య క్యారెక్టర్‌ను రహస్యంగా ఉంచారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: