టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ‘అరవింద సమేత ’. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.  ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ చూస్తుంటే...ఎన్టీఆర్ రెండు రకాల పాత్రలు పోషించినట్లు కనిపిస్తుంది.  పూజా హెగ్డేతో చేస్తున్న రొమాన్స్..చాలా ఫన్నీ వాతావరణంలో సాగినా..తర్వాత వచ్చిన సీన్లు రాయలసీమ ఫ్యాక్షనిజం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది.   ఈ సినిమా హారికా అండ్ హాసిని బ్యానర్‌పై రూపొందుతోంది.

‘అరవింద సమేత’లో ఎన్టీఆర్  డ్యుయెల్ రోల్‌లో కనిపించబోతున్నాడన్న విషయం ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే.  కాకపోతే ఈ విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.  అంతే కాదు రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు, ఫైట్ సీన్ లీక్ కావడంతో అన్ని విషయాల్లో దర్శకుడు త్రివిక్రమ్ చాలా గోప్యంగా ఉంచడం మొదలు పెట్టినట్లు సమాచారం. తాజాగా ‘అరవింద సమేత’ గురించి మరో సెన్సేషనల్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

ఎన్టీఆర్ చిన్నప్పటి క్యారెక్టర్‌లో ఆయన కుమారుడు అభయ్ రామ్ నటిస్తున్నాడట. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ చాలా సీక్రెట్‌గా ఉంచుతోందని తెలుస్తోంది.  ఇప్పటికే జరిగిన లీకేజీల ప్రాబ్లామ్ తో ఈ విషయాన్ని మరింత సీక్రెట్ గా ఉంచుతున్నట్లు టాలీవుడ్ టాక్. ఇదే నిజమైతే నందమూరి అభిమానులకు ఇంతకన్నా సంతోషం కలిగించే వార్త మరొకటి ఉండదు. ఈ సినిమా దసరా కానుకగా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: