టాలీవుడ్ లో నటించిన సినిమాలు మూడే అయినా..తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన హీరో విజయ్ దేవరకొండ.  తన యాస , మానరీజంతో రెండు రాష్ట్రాల్లో అభిమానులను సంపాదించాడు విజయ్ దేవరకొండ.  ఈ మద్య రిలీజ్ అయిన ‘గీతాగోవిందం’ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే.  ఈ రోజు విజయ్ దేవరకొండ నటించిన ‘నోటా’ సినిమా రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో మిశ్రమ స్పందన వస్తుంది.  అయితే ‘నోటా’సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు మీడియాతో పంచుకున్నాడు. 
Image result for nota movie
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..చిన్నప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వం అంటే చాలా ఇష్టమని అన్నారు. ఆయన హయాంలోనే హైదరాబాద్‌ నగరానికి బూమ్‌ వచ్చింది. సమయ పాలన విషయంలో ప్రభుత్వోద్యోగులు చాలా హడావుడి పడటం చూసేవాణ్ని. ఉద్యోగులంతా సరైన సమయానికే కార్యాలయాలకు వచ్చేందుకు ఆయన బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేశారని... అది తనకు ఎంతో నచ్చిందని చెప్పాడు. 

ఈ విధానాన్ని తీసుకువచ్చిన చంద్రబాబు పట్ల ఉద్యోగులు ఆగ్రహాన్ని వెలిబుచ్చారని అన్నాడు. అలా స్ట్రిక్ట్‌గా ఉంటే నాకు ఇష్టం. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వ పాలన నాకు బాగా నచ్చింది.   కేటీఆర్‌ని కలిసిన తర్వాత ఆయన ఆలోచనలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు విజయ్‌ సినిమా షూటింగ్స్ లో ఎక్కువగా  ప్లాస్టిక్‌ని వినియోగించొద్దు. రాగి వస్తువులు కొనుక్కుని వాటితో నీళ్లు తాగు ఆరోగ్యానికి మంచిది అంటూ ఎన్నో సలహాలు ఇచ్చారు. 

అంతే కాదు నువ్వు ఒక మంచి నటుడివి కనుక ఖాదీ వస్త్రాలకు ప్రచారం కల్పించొచ్చు కదా! అని చెప్పారు అని తెలిపాడు విజయ్. ఎవరు గొప్ప ముఖ్యమంత్రి? అనే ప్రశ్నకు బదులుగా ఆ విషయం తనకు తెలియదని చెప్పాడు. తన తాజా చిత్రం 'నోటా' ప్రమోషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ ప్రశ్నలకు బదులిస్తూ విజయ్ ఈ మేరకు స్పందించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: