ఎన్నో అంచనాల నడుమున మధ్య రిలీజ్ అయినా నోటా ఫస్ట్ షో కే సినిమా లో మేటర్ లేదని తెలిసిపోయింది. పాలిటిక్స్‌కి, పొలిటీషియన్స్‌కి మధ్య వేలు చూపించడం ఏమో కానీ, ఈ పోస్టర్‌ చూపించి విజయ్‌ అభిమానులకి, అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులకి దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ అంతకు మించే చూపించాడు! రాజకీయాల గురించి ఓనమాలు కూడా రాని ఒక జల్సా కుర్రాడికి రాత్రికి రాత్రి రాష్ట్రానికి సిఎం అయిపోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. పాలిటిక్స్‌లో ఏ బి సి డి కూడా రాని అతను కుటిల రాజకీయాలని, వెనక జరిగే కుతంత్రాలని ఎలా డీల్‌ చేస్తూ తనదైన శైలిలో ఆకట్టుకుంటాడనేది స్టోరీ. పాయింట్‌గా వినడానికి బాగుంది. స్కోప్‌ కూడా బాగానే వుంది.

Image result for nota vijay devarakonda

'భరత్‌ అనే నేను'కి ఇంచుమించు ఇలాంటి బిగినింగే వున్నా దానిని కమర్షియల్‌గా డీల్‌ చేసాడు కొరటాల శివ. ఈ చిత్రాన్ని సహజత్వానికి దగ్గరగా, సీరియస్‌ పాలిటిక్స్‌తో చూపించారనే 'భ్రమ' ట్రెయిలర్‌ కలిగించింది. అది భ్రమేనని తేలిపోవడానికి 'నోటా' ఎక్కువ సమయం తీసుకోలేదులెండి. జస్ట్‌ ఒక ఐడియాగా అనుకున్నదానికి ఒక స్ట్రక్చర్‌ వున్న స్టోరీ, ఒక పద్ధతైన స్క్రీన్‌ప్లే రాసుకోకుండానే సెట్స్‌ మీదకి వెళ్లిపోయారనిపించేలా సన్నివేశాలన్నీ చాలా కృతకంగా అనిపిస్తాయి.

Image result for nota vijay devarakonda

పధ్నాలుగు రోజుల పాటు సిఎంగా వున్నా కూడా వీడియో గేమ్స్‌ ఆడడం, నెట్‌ఫ్లిక్స్‌ చూడడం మినహా ఏమీ చేయని వాడు ఒక రోజు సడన్‌గా అప్పటికప్పుడు సిఎంలా బిహేవ్‌ చేస్తాడు. ఒక పాప ప్రాణం పోవడంతో ఫుల్‌ పవర్‌ చూపించేసి అదరగొట్టేసిన వాడే తదుపరి సీన్‌లో మళ్లీ యథావిధిగా తన ధోరణి ప్రదర్శిస్తాడు. ఫస్ట్‌ సీన్‌లో ఎక్కడ వుంటుందో కథ ఇంటర్వెల్‌కి కూడా అక్కడే వుండడం, ఇంచ్‌ కూడా ముందుకి కదలకపోవడం 'నోటా' ప్రత్యేకత అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: