కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరు మురుగదాస్.  ఇప్పటి వరకు ఎన్నో హిట్ సినిమాలు అందించిన మురుగదాస్ రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు తో తీసిన ‘స్పైడర్ ’ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. `స్పైడర్` సినిమాను మినహాయిస్తే దర్శకుడిగా మురుగదాస్ ట్రాక్ సూపర్. సరికొత్త కథల్ని జనరంజకంగా తెరకెక్కించడంలో దర్శకుడు మురుగదాస్ శైలే వేరు. ఆయన నుంచి సినిమా వస్తున్నదంటే ప్రేక్షకుల్లో వుండే ఆసక్తి ప్రత్యేకమైనది.  ప్రస్తుతం విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన 'సర్కార్ ' విడుదలకి ముస్తాబవుతోంది.


పోస్టర్స్ ను వదిలిన దగ్గర నుంచే అందరి దృష్టి ఈ సినిమా వైపుకు మళ్లింది. గతంలో మురుగదాస్ .. విజయ్ కాంబినేషన్లో వచ్చిన 'కత్తి' .. 'తుపాకీ' చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలను సాధించడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక చూడటానికి చాలా కూల్ గా కనిపించే మురుగదాస్ తన టీమ్ కే వార్నింగ్ ఇవ్వడం ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అసలు మురుగదాస్ తన అసిస్టెంట్లు - టీమ్ కి ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? అన్న టాక్ నడుస్తోంది.  ప్రస్తుతం  విజయ్ హీరోగా మురుగదాస్ `సర్కార్` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తమిళంలో సమకాలీన రాజకీయాంశాల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ అత్యంత భారీ స్థాయిలో  నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ `మెర్సల్` తరువాత విజయ్ చిత్రానికి మరోసారి సంగీతం అందిస్తున్నారు. ఈ మద్య 'సర్కార్' సినిమాలో నటించిన జూనియర్ ఆర్టిస్టులు ఈ సినిమాను గురించి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు.


నా అనుమతి లేకుండా ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూలు ఎవరిచ్చినా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన ట్వీట్ చేశాడు. ఈ సినిమాకి సంబంధించిన ఏ సన్నివేశం గురించి మాట్లాడినా కథ లీకై .. ఆడియన్స్ థ్రిల్ ను కోల్పోయే అవకాశం వుంది. సెట్లో వుండే జూనియర్ ఆర్టిస్టుల వల్ల సినిమా కథ రివీలైతే అది సినిమాకు ప్రమాదంగా మారే అవకాశం వుందని గమనించిన మురుగదాస్ టీమ్ సభ్యులకు వార్నింగ్ ఇచ్చినట్లు చిత్ర బృందం చెబుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: