మూడు సినిమాలు హిట్ అయ్యే సరికి తన సినిమాల సెలక్షన్ మీద కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చినట్టు అనిపించిన విజయ్ లేటెస్ట్ మూవీ నోటా మూవీ రిజల్ట్ చూస్తే నిజమే అనేలా అనిపిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో శుక్రవారం రిలీజైన నోటా సినిమా విజయ్ కెరియర్ లో హయ్యెస్ట్ బిజినెస్ చేయగా లోయెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. 


అంతేకాదు సినిమా మొదటి ఆటకే ఆడియెన్స్ అసలు రౌడీ హీరో ఎందుకు ఈ సినిమా చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. పబ్లిక్ టాక్ అయితే ఘోరంగా ఉంది. అసలు విజయ్ కు కథ ఏం చెప్పి ఒప్పించారు. సినిమాలో ఏం చూపించారు. అసలు దర్శకుడు ఇచ్చిన మెసేజ్ ఏంటి.. అతనేం చెప్పాలనుకున్నాడు.


ఇవి ఆడియెన్స్ అడుగుతున్న ప్రశ్నలు. అసలు సినిమా కథకు టైటిల్ కు కూడా సంబంధం లేకుండా పెట్టారని వాపోతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే సినిమా ఆడియెన్స్ కు నచ్చితేనే హిట్ లేదంటే అంతే సంగతులు. ఈమధ్య ఆడియెన్స్ లో ఓ కూడా ఓ రివ్యూయర్ తయారవుతున్నాడు. కాబట్టి వారి ఆలోచనలకు విలువ ఇవ్వాల్సిందే.


మరి విజయ్ నోటాకు ఆడియెన్స్ నుండి వచ్చిన ఈ రివర్స్ పంచ్ అసలు ఊహించి ఉండడు. చెప్పాలంటే కెరియర్ పీక్స్ లో ఉన్న ఇలాంటి టైంలో విజయ్ ఇలాంటి సినిమా చేయడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తమిళంలో డెబ్యూ మూవీగా ఇది ఓకే కాని ఇక్కడ ఈ స్టఫ్ సరిపోదు. వుయ్ వాంట్ మోర్ ఫ్రం రౌడీ స్టార్ అంటున్నారు. కాబట్టి ఈ రౌడీ సిఎం తెలుగు ప్రేక్షకులకు అసలు ఎక్కలేదని చెప్పొచ్చు.   


మరింత సమాచారం తెలుసుకోండి: