కెరియర్ దాదాపు అటకెక్కేసింది అనుకున్న టైంలో సరైన టైంకు సరైన నిర్ణయాలు తీసుకుంది కాజల్ అగర్వాల్ అందుకే అమ్మడు ఇంకా లీడింగ్ యాక్ట్రెస్ గా మంచి ఫాం కొనసాగిస్తుంది. ఖైది నంబర్ 150 సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించిన కాజల్ ఆ సినిమాతో తన రేంజ్ మరింత పెంచుకుందని చెప్పొచ్చు.


ఇక ఆ తర్వాత నేనే రాజు నేనే మంత్రి కూడా కాజల్ కు మంచి బూస్టింగ్ ఇచ్చింది. ప్రస్తుతం యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో జోడి కడుతుంది కాజల్. తేజ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కాజల్ నటించేందుకు ఏకంగా 1.75 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుందట. బెల్లంకొండ తన ప్రతి సినిమాలో స్టార్ హీరోయిన్ ఉండేలా ప్లాన్ చేస్తాడు.


మొదటి సినిమా అల్లుడు శీను నుండి లాస్ట్ వచ్చిన సాక్ష్యం వరకు సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్దె ఇలా అందరితో నటించాడు. ఇక ఇప్పుడు కాజల్ తో రొమాన్స్ చేస్తున్నాడు. బెల్లంకొండ బాబు పక్కన ముందు నో చెప్పిన కాజల్ సినిమాకు రెమ్యునరేషన్ గా 1.75 కోట్లు అనగానే ఓకే చెప్పిందట. 


ఇక ఆ రేంజ్ లో పారితోషికం ఇస్తున్నారు అంటే ఇక సినిమాలో ఆమె వాడకం ఏ విధంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికి మతి పోగొట్టే అందాలతో కుర్రాళ్లను గిలిగింతలు పెడుతున్న కాజల్ కెరియర్ లో ఎప్పుడు చూడని హాట్ గా తేజ సినిమాలో కనిపిస్తుందట. బెల్లంకొండ బాబుతో కాజల్ రొమాన్స్ ఎలా ఉంటుందో చూడాలంటే సినిమా వస్తేనే కాని చెప్పలేం.



మరింత సమాచారం తెలుసుకోండి: