క్రేజీ హీరో విజయ్ దేవరకొండకు కోలీవుడ్ హీరోయిన్ త్రిష నుండి ఊహించని దెబ్బ పడటం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. నిన్న విడుదలైన ‘నోటా’ తో పాటు విజయ్ సేతుపతి త్రిషల కాంబినేషన్ లో రూపొందిన “96” మూవీకి కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడ బ్రహ్మరధం పడుతున్నారు. 
Vijay Sethupathi Trisha Krishnan 96 Movie Photos
విశ్లేషకులు ఈమూవీకి చాల మంచి రేటింగ్స్ ఇస్తూ ఉంటే ‘నోటా’ కు మాత్రం అతితక్కువ రేటింగ్స్ ఇస్తున్నారు. త్రిష కెరియర్ లో మరో సూపర్ హిట్ సినిమా అని ప్రచారం జరుగుతోంది. దీనితో ‘96’ పాజిటివ్ టాక్ ముందు ‘నోటా’ మన టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడ ఫ్లాప్ ముద్రను వేసుకుంది. 

ఇప్పటికే ‘96’ మూవీ రీమేక్ రైట్స్ ను దిల్ రాజ్ సొంతం చేసుకున్న నేపధ్యంలో ఇప్పుడు ఈసినిమా రీమేక్ లో నటించడానికి చాలామంది హీరోలో పోటీ పడే అవకశం ఉంది. ఇది ఇలా ఉండగా నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘నోటా’ కు ఓవర్సీస్ లో కూడ నెగిటివ్ టాక్ వచ్చింది. 

ఈమూవీని అమెరికాలో 220 సీన్స్ లో విడుదల చేసినా ‘గీత గోవిందం’ మొదటిరోజు ఓవర్సీస్ కలక్షన్స్ లో సగం కూడ ‘నోటా’ కు రాకపోవడంతో ఈమూవీ ఎలాంటి నెగిటివ్ టాక్ ను తెచ్చుకుందో అర్ధం అవుతుంది. ఈమూవీ అంతా తమిళ వాసనతో ఉండటంతో పాటు చెప్పే పొలిటికల్ స్టోరీ విషయంలో కొత్తదనం లేకపోవడం ‘నోటా’ కు శాపంగా మారింది అంటున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ మ్యానియాకు మన టాప్ హీరోలు అంతా భయపడుతూ ఉంటే అసలు ఏమాత్రం క్రేజ్ లేని త్రిష విజయ్ దేవరకొండ క్రేజ్ కు చెక్ పెట్టడం ఊహించని షాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: