తెలుగుసినిమా ప్రేక్షకులకు ప్రస్తుతం పాటలరచయిత గాయకుడు పెంచల్ దాస్ గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరంలేదు. ‘అరవింద సమేత’ మూవీలో 'కట్టెలే చుట్టాలు...కాడు మన తల్లిదండ్రి... అగ్గిదేవుడే మనకు ఆత్మబంధువుడంట... కాలవ గట్టున నీ కాళ్లు కాలంగా కాకిశోకము పోతివే'' అంటూ ఆయన వ్రాసి పాడిన పాటకు జూనియర్ ఎన్టీఆర్ నుండి అందరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయిన విషయం తెలిసిందే. 
 చివరకు ఆ పాట నచ్చింది
అయితే ఈవిలక్షణ గాయకుడుకి సినిమా పరిశ్రమ అన్నా ముఖ్యంగా టాప్ హీరోల వ్యవహార శైలి అన్నా ఏమాత్రం నచ్చదట. అందువల్లనే ‘అరవింద సమేత’ షూటింగ్ సమయంలో అక్కడ పరిస్థుతులు తనకు నచ్చక అనేకసార్లు ఎవరికీ చెప్పకుండా ఆషూటింగ్ స్పాట్ నుండి వెళ్ళిపోతే త్రివిక్రమ్ సహనంతో తనను ఒప్పించి తిరిగి ‘అరవింద సమేత’ షూటింగ్ స్పాట్ కు తీసుకువచ్చిన ఆసక్తికర విషయానికి సంబంధించి కొన్నివిషయాలు పెంచల్ దాస్ ఈమధ్య ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించాడు. 
 వీళ్లంతా గోదారోళ్లు కాబట్టి స్లాంగ్ తెలియదు
స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న తనకు ఒకరోజు అనుకోకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ నుండి ఫోన్ వచ్చింది అని చెపుతూ తాను జూనియర్ ఎన్టీఆర్ తో తీస్తున్న సినిమాకు ఒక విషాద ఛాయలతో ఉండే ఒకపాట రుడాలి సాంప్రదాయంలో కావాలి అంటూ అడిగిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు పెంచాల్ దాస్. రుడాలి సాంప్రదాయం అంటే బెంగాళీలో శవాల దగ్గర డబ్బులు తీసుకుని ఏడుస్తూ పాడే విధానం. 
సినిమాలు, హీరోలు ఆసక్తి లేదు, త్రివిక్రమ్ కోసమే...
అదేవిధంగా రాయలసీమ పదాలతో ఒకవిషాద గీతాన్ని వ్రాయమని చెపితే తాను చాలకష్టపడి ఈపాటను రాయడం జరిగింది అంటూ ‘కట్టెలే చుట్టాలు’ అనే పదం త్రివిక్రమ్ కు బాగా నచ్చడంతో రాయలసీమ బ్యాగ్రౌండ్ తో తాను తీస్తున్న ‘అరవింద సమేత’ కు డైలాగులు వ్రాసి తనకు సహాయపాడమని త్రివిక్రమ్ పెంచాల్ దాస్ ను కోరాడట. దీనితో ఈ విలక్షణ గాయకుడు తరుచూ ‘అరవింద సమేత’’ షూటింగ్ స్పాట్ కు వచ్చే వాడినని చెపుతూ అయితే ఆషూటింగ్ వాతావరణం అదేవిధంగా టాప్ హీరోలకు షూటింగ్ స్పాట్ లో ఇచ్చే గౌరవం తనకు నచ్చక పోవడంతో తాను త్రివిక్రమ్ కు కూడా చెప్పకుండా షూటింగ్ స్పాట్ నుండి బయటకు వెళ్ళిపోతే అనేక సార్లు ఎంతో ఓర్పుతో తనను వెతికి పట్టుకుని తన చేత రాయలసీమ డైలాగ్స్ తో పాటు ఆ డైలాగ్స్ మాడ్యులేషన్ ఎంతో ఓర్పుతో తన నుండి రాబట్టుకున్న త్రివిక్రమ్ ఓర్పుకు తాను పడిపోయాను అంటూ ‘అరవింద సమేత’ విషయంలో త్రివిక్రమ్ కనపరిచిన శ్రద్ధ ఓర్పును వివరంగా వివరించాడు పంచల్ దాస్..  


మరింత సమాచారం తెలుసుకోండి: