ఈ మద్య టాలీవుడ్ లో ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు మినిమం వంద కోట్ల బడ్జెట్ తో నిర్మాణం అవుతున్నాయి. ఇక వసూళ్లు కూడా అదే రేంజ్ లో సాధిస్తున్నాయి.  ఈ సంవత్సరం సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్, సమంత జంటగా నటించిన ‘రంగస్థలం’ సినిమా సూపర్ హిట్ అయ్యింది.  ఈ సినిమా కోసం సుకుమార్ ఏకంగా ‘రంగస్థలం’ అనే గ్రామాన్నే క్రియేట్ చేశారు.  అద్భుతమైన సెట్టింగ్స్ తో 1985 కాలం నాటి పరిస్థితులకు  అద్దం పట్టే విధంగా తీర్చి దిద్దారు.  ఈ సినిమా చూస్తున్నంత సేపు అప్పటి కాలంలో ప్రయణించినట్లు అనిపిస్తుంది. 

ఇలాంటి సెట్టింగ్స్ క్రియేట్ చేయడంలో రాజమౌళి, క్రిష్ లాంటి డైరెక్టర్లు ఇప్పటికే చేసిన ప్రయోగాలు చూస్తే తెలుస్తుంది.  రాజమౌళి ఒక మాహిష్మతి రాజ్యాన్ని సృష్టిస్తే..క్రిష్ ‘కంచె’సినిమాలో 1945 కాలం నాటి యుద్దానికి సంబంధించిన పరిస్థితులకు కళ్లకు కట్టినట్టు చూపించారు.  ఇలా స్టార్ హీరోల సినిమాలకు సందర్భాన్ని బట్టి ఆయా సెట్టింగులకు రూపకల్పన చేస్తున్నారు. మహేశ్ బాబు తన 25వ సినిమాగా 'మహర్షి' చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యూఎస్ లో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.  అక్కడ నుంచి వచ్చిన తర్వాత...తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. భారీ ఖర్చుతో అక్కడ విలేజ్ సెట్ ను వేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు .. ఈ విలేజ్ సెట్ ను .. నిజమైన విలేజ్ లా అనిపించేలా చాలా సహజంగా తీర్చిదిద్దుతున్నారు. 'మహర్షి' టీమ్ విదేశాల నుంచి తిరిగి వచ్చేలోగా ఈ సెట్ ను పూర్తి చేస్తారట.

జయసుధ .. ప్రకాశ్ రాజ్ .. అల్లరి నరేశ్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.   కాగా, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ ఇక్కడ చిత్రీకరణ చేసిన విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: