యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో ఓ మహిళా అభిమాని ఫోటో తీయించుకుంది. ఇందులో స్పెషల్ ఏముంది ఎంతోమంది అభిమానులతో ఎన్.టి.ఆర్ ఫోటో దిగుతాడు కదా అనుకోవచ్చు. ఇక్కడే స్పెషల్ ఉంది. అయితే ఆ అభిమాని ఎవరో కాదు ఓ నటుడి తల్లి. అరవింద సమేత సినిమాలో ఆ నటుడు కూడా ఉన్నాడు.


ఇంతకీ ఎవరా నటుడు ఏంటా విశేషాలంటే.. త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న అరవింద సమేత సినిమాలో ఎన్.టి.ఆర్ హీరోగా చేస్తుండగా ప్రతి నాయకుడిగా జగపతి బాబు నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నవీన్ చంద్ర కూడా నటిస్తున్నాడని తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జగపతి బాబు ఓ పిల్లర్ అయితే నవీన్ చంద్ర కూడా ఈ సినిమాకు మరో పిల్లర్ అనేశాడు తారక్.


అందాల రాక్షసి సినిమా నుండి హీరోగా సినిమాలైతే చేస్తున్నాడు కాని పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేని నవీన్ చంద్ర ఇప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలకు సై అంటున్నాడు. ఇక అరవింద సమేత సినిమాలో కూడా నవీన్ చంద్ర మంచి రోల్ పోశించాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సందర్భంగా నవీన్ చంద్ర అమ్మ గారు ఎన్.టి.ఆర్ తో ఫోటో దిగారట.


ఎన్.టి.ఆర్ తో ఫోటో దిగడం ఆమె కలట. అయితే తల్లి కలను సాకారం చేయడమే తన కల అంటూ ఎన్.టి.ఆర్ తో దిగిన పిక్ షేర్ చేస్తూ ట్వీట్ చేశాడు నవీన్ చంద్ర. అంతేకాదు తానో పెద్ద స్టార్ అయినా మంచింతనం, విధేయత, సింప్లిసిటీ బెస్ట్ క్వాలిటీస్ అన్నాడు. అమ్మ ఎక్సైట్మెంట్ నాకు ప్రేరణ కలిగిస్తాయి.. నీ ప్రతి కలని నిజం చేయడమే తన కల అంటూ నవీన్ ఎమోషనల్ మెసేజ్ పెట్టాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: