‘బాహుబలి’ తోనేషనల్ సెలిబ్రిటీగా మారిపోయిన తన సినిమాలకు జాతీయ మార్క్ ఏర్పరుచుకుని తద్వారా టాలీవుడ్ కలక్షన్స్ కింగ్ గా మారాలని తన సినిమాల విషయంలో ఎటువంటి రాజీ లేకుండా భారీ బడ్జెట్ తో నిర్మించడానికి తన సొంత నిర్మాణ సంస్థను ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలు అన్ని జాతీయ మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకునే నిర్మిస్తున్నారు. 
Prabhas-Stylish-Look
అంతేకాదు తానూ నటించే ప్రతి సినిమాకు యూనివర్సల్‌ అప్పీల్‌ ఉండేలా చూసుకుంటున్నాడు. హిందీ తమిళ మలయాళ మార్కెట్లని కొల్లగొట్టడమే ధ్యేయంగా కాకుండా విదేశీ భాషలలో తన సినిమాలను డబ్ చేసే విధంగా పావులు కదుపుతున్నాడు. ఇప్పటికే తన స్నేహితుల ద్వారా తన యూవీ నిర్మాణ సంస్థ కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్రభాస్ సినిమా రంగానికి సంబంధించి మరో వ్యాపారంలోకి అడుగు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
UV Creations.jpg
తెలుస్తున్న సమాచారం మేరకు ప్రభాస్ తన  యూవీ క్రియేషన్స్‌ ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థగా  మార్చడమే కాకుండా అటు పంపిణీ రంగంలోకి కూడా యూవీ క్రియేషన్స్ అడుగు పెట్టె విధంగా    థియేటర్స్‌ బిజినెస్‌లోకి కూడా ప్రభాస్‌ పూర్తి స్థాయిలో అడుగు పెట్టబోతునాట్లు టాక్. ప్రస్తుతం ఈవిషయానికి సంబంధించి హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని  పలు పాత థియేటర్లని కొనేస్తూ రీమోడలింగ్‌ మీద దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. 
Prabhas
ప్రస్తుతం టాప్ హీరోల మధ్య పోటీ విపరీతంగా పెరిగిపోయిన నేపధ్యంలో థియేటర్స్‌ పై పట్టు ఉండటం చాలా అవసరం అని ప్రభాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలేమహేష్‌ మల్టీప్లెక్స్‌ చెయిన్‌ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. దీనితో ఇదే పంధాలో చాలామంది టాప్ హీరోలు రంగంలోకి వస్తున్నారు అన్న సంకేతాలు రావడంతో అందరికంటే ముందుగా థియేటర్స్ విషయంలో పట్టు సాధించడానికి ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: