ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల మధ్య పోటీ మాత్రమే ఉండేది.. అయితే సినిమాల మధ్య పోటీ అటుంచితే ఈమధ్య స్టార్స్ మధ్య మంచి సాన్నిహిత్యం పెరిగింది. వారి అభిమానుల్లో మార్పు తెచ్చేందుకు హీరోలు చేస్తున్న ఈ ప్రయత్నం మెచ్చుకోదగినదే. అయితే స్నేహంగా ఉండటమే కాదు ఈమధ్య మల్టీస్టారర్స్ కు సై అనేస్తున్నారు హీరోలు.


ప్రస్తుతం సెట్స్ మీద క్రేజీ మల్టీస్టారర్స్ ఉన్నాయి. ఇక వాటితో పాటుగా కొన్ని అభిమానులు ఆశిస్తున్న క్రేజీ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. స్టార్ దర్శకుడు.. స్టార్ హీరో ఇప్పటివరకు పనిచేయని వారు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో అని ఆడియెన్స్ ఆలోచన. ముందుగా అలాంటి కాంబినేషన్ లో ప్రస్థావిస్తే రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో సినిమా కావాలని కోరుకుంటున్నారు.


ఆల్రెడీ ఇద్దరు ఈ సినిమా కోసం అడ్వాన్సులు కూడా తీసుకున్నారు కాని తన సినిమాలతో మహేష్, రజమౌళి ఇద్దరు బిజీ అవడం వల్ల ఆ కాంబో సెట్ అవట్లేదు. ఇక తర్వాత రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడు విలక్షణ నటుడు కమల్ హాసన్ తో సినిమా చేస్తే చూడాలని ఉందని అంటున్నారు ప్రేక్షకులు. ఇదే కాకుండా మాన్లీ స్టార్ గోపిచంద్ తో బోయపాటి శ్రీను సినిమా తీస్తే కూడా అదుర్స్ అనేలా ఉంటుందని చెబుతున్నారు.


ఇక త్రివిక్రం, నాని కాంబో సినిమా కూడా ఆడియెన్స్ ఎదురుచూస్తున్న కాంబినేషనే.. ఇక ఇదే కాకుండా ముగ్గురు స్టార్స్ కలిసి చేసే మెగా మల్టీస్టారర్ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మహేష్, ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తే ఆ కిక్కే వేరంటూ చెబుతున్నారు. అంతేకాదు చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కలిసి ఓ సినిమా చేయాలని అడుగుతున్నారు. మరి ఈ అభిమానుల ఆలోచనలకు తగినట్టుగా దర్శకులు కథలను సిద్ధం చేస్తే కనుక సినిమాలు చేసేందుకు వారు రెడీ అన్నట్టు తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: