గ్లామర్ డాల్  గా ఫిలిం ఎంట్రీ ఇచ్చి ఆతరువాత టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయిన సమంత ఆపై నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని అక్కినేని కోడలుగా మారిన తరువాత సమంత ఆలోచనలలో చాల మార్పులు వచ్చాయి. దీనితో ఆమె హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు చిరునామాగా మారాలని చేసిన తొలి ప్రయత్నం కమర్షియల్ గా సక్సస్ కాకపోవడంతో సమంత రాంగ్ టర్న్ తీసుకుందా అన్న కోణంలో ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి.

దీనికి కారణం క్రితం నెల విడుదలైన ‘యూటర్న్’ ఫలితం ఈమూవీకి విమర్శకుల ప్రశంసలు లభించడంతో పాటు ఈమూవీకి సాధారణ ప్రేక్షకులనుండి పాజిటివ్ టాక్ వచ్చినా కలక్షన్స్ విషయంలో ఈమూవీ ఏమాత్రం నిలబడలేకపోయింది. తెలుగు తమిళ భాషలలో ఒకేసారి విడుదలైన ఈమూవీకి సమంతకు ఉన్న క్రేజ్ రీత్యా 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 

అయితే ఈమూవీ విడుదలైనప్పటి నుండి ఓపెనింగ్ కలక్షన్స్ దగ్గర నుండి చివరకు క్లోజింగ్ కలక్షన్స్ వరకు అన్ని విషయాలలో వెనక బడతంతో ఈమూవీ బయ్యర్లకు సుమారు 7 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి అన్న వార్తలు వస్తున్నాయి. ఇదే సంవత్సరం జనవరిలో విడుదలైన అనుష్క ‘భాగమతి’ మూవీ పెద్దగా సక్సస్ కాకపోయినా అనుష్కకు ఉన్న క్రేజ్ రీత్యా ఈమూవీ ఓపెనింగ్ కలక్షన్స్ భారీగా రావడంతో ‘భాగమతి’ బయ్యర్లు పెద్దగా నష్టాలు లేకుండా బయట పడ్డారు.

ఇక ఈమధ్యనే విడుదలైన నయనతార లేటెస్ట్ మూవీ ‘కోకో కోకిల’ సినిమా అంతా నయనతార చుట్టూ నడిచినా ఆమూవీకి రజినీ కాంత్ సినిమా స్థాయిలో ఓపెనింగ్ కలక్షన్స్ రావడమే కాకుండా ఈమూవీ తెలుగు తమిళ భాషలలో కూడ మంచి హిట్ టాక్ ను తెచ్చుకుంది. అంతేకాదు ఈమూవీలోని నయనతార నటనకు మెచ్చి ఆస్కార్ ప్రిలిమెనరీ రేస్ కు ఎంపిక అయింది అంటే నయనతార రేంజ్ అర్ధం అవుతుంది. ఇలాంటి పరిస్థుతులలో సమంత ‘యూటర్న్’ ఫెయిల్ కావడంతో రానున్న కాలంలో హీరోయిన్ ఒరియంటెడ్ సినిమాలు చేస్తూ మరికొంతకాలం ఇండస్ట్రీలో కొనసాగాలి అని కలలు కంటున్న సమంత ఊహలకు ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: