సోనమ్ కపూర్ కు సోషల్ మీడియా లో సెగ గట్టిగానే తగిలింది. అయితే సెలెబ్రెటీస్ కు సోషల్ మీడియా లో వ్యతిరేకంగా పోస్ట్ లు పెట్టడం కొత్తేమి కాదు అయితే ఈ సారి సోనమ్ కపూర్ బాగా హార్ట్ అయ్యింది. సెలెబ్రెటీస్ చేసే ప్రతి పనిని లేదా ప్రతి పోస్ట్ ను కొంత మంది విమర్శిస్తుంటారు. సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. కానీ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని, అంతా నెగటీవిటి ఉందని చెబుతూ ట్విట్టర్ నుంచి వైదొలుగుతున్నట్లు సోనమ్ ట్వీట్ ద్వారా ప్రకటించింది.

Image result for sonam kapoor

అయితే అందుకు కారణమైన ప్రధానాంశం కాలుష్యం. ‘ట్విట్టర్ నుంచి కొంతకాలం వైదొలుగుతాను. అంతా నెగటివిటియే ఇందుకు కారణం. ప్రశాంతత, ప్రేమ మీ అందరికీ’ అంటూ సోనమ్ ట్వీట్‌లో పేర్కొంది. నగరానికి చేరుకునేందుకు రెండు గంటల సమయం పట్టింది. అయినా నా గమ్యాన్ని మాత్రం చేరుకోలేకపోయాను. అందుకు కారణం రోడ్లు చెత్తగా ఉన్నాయి. కాలుష్యం అయితే భయపెడుతోంది.

Image result for sonam kapoor

ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయం వేస్తోందని’ తనకు ఎదురైన సమస్యను సోషల్ మీడియాలో సోనమ్ పోస్ట్ చేసింది. మీ లాంటి సెలబ్రిటీల వల్లే ఈ ట్రాఫిక్, కాలుష్యం మొత్తం మీరే చేశారంటూ నెటిజన్లు సోనమ్‌ను దుమ్మెత్తిపోశారు. నీలాంటి మగవాళ్ల వళ్ల మహిళలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగించుకోరు. వేధింపులకు పాల్పడతారని భయపడుతారని’ సోనమ్ ఘాటుగా స్పందించింది. ఆ నెటిజన్ చెప్పింది అక్షరాలా నిజమేనంటూ మరికొందరు అతడికి మద్దతు తెలుపుతూ సోనమ్‌పై నెగటివ్ కామెంట్లు చేశారు. దీంతో చాలా బాధగా సోనమ్ ట్విట్టర్‌ ఖాతాకు కొన్ని రోజులు దూరంగా ఉంటానని తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: