మెగా పవర్ స్టార్ రాం చరణ్. ఆ పేరు లోనే మాస్ టచ్ ఉంది. ఆయన చేసిన సినిమాలు దాదాపుగా అలాటివే. క్లాస్ మూవీగా అపుడెపుడో అరెంజ్ సిన్మా చేస్తే దెబ్బ కొట్టింది. మళ్ళీ ఆ జోలికి వెళ్ళలేదు. కానీ క్లాస్ టైటిల్స్ పై మాత్రం మక్కువ పోలేదు. అందువల్లనే గోవిందుడు అందరివాడేలే టైటిల్ తో వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించారు. ఇపుడు మళ్ళీ అలాంటి ప్రయోగమే చేయబోతున్నారు.


టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే రాం చరణ్ బోయపాటి మూవీకి ఓ క్లాసికల్ తచ్ ఉన్న టైటిల్ ఫిక్స్ చేస్తున్నారని. ఆ టైటిల్ వినయ విధేయ రామ. దీనిని బట్టి ఈ మూవీ ఎలా ఉండబోతోందీ చెప్పవచ్చు. అంటే ఫక్త్ ఫ్యామిలీ మూవీగా ఉంటుందని తెలుస్తోంది. దీనికి ముందు మాస్ టైటిల్స్ కూడా కొన్ని అనుకున్నారు. అంతే కాదు. మెగాస్టార్ ఓల్డ్  మూవీ స్టేడ్ రౌడీ పేరు కూడా పెట్టాలనుకున్నారు. బాబాయి పవన్ మూవీ తమ్ముడు పేరునూ ఓ దశలో పరిశీలించారు. . చివరికి ఇలా ఫిక్స్ అయ్యారట.


ఈ చిత్ర నిర్మాత  నిర్మాత డీవీవీ దానయ్య ఈ టైటిల్‌ను ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్‌ చేయించినట్టుగా తెలుస్తుంది. బోయపాటి గత చిత్రం జయ జానకి నాయక టైటిల్‌ తరహాలోనే ఈ సినిమాకు కూడా క్లాస్‌ టైటిల్‌ను నిర్ణయించే అవకాశం ఉందన్న టాక్‌ వినిపిస్తోంది. దసరా సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసే అవకాశం ఉంది. అదే రోజు టైటిల్‌ విషయంలో కూడా క్లారిటీ వస్తుందని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్‌.

మొత్తానికి దే టైటిల్ అయితే రాం చరణ్ మరో మారు క్లాస్ టైటిల్ తో సూపర్ డూపర్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నట్లు లెక్క. అంతే కాదు. ఆయన నటనతో సైతం అటు ఫ్యాన్స్ ని ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఫిదా చేయడం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: