జబర్దస్త్ షోతో సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న సుధీర్ అదేనండి సుడిగాలి సుధీర్ తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని బాగా వాడుకుంటున్నాడు. జబర్దస్త్ టీం కెప్టెన్ గా కొనసాగుతూనే ఢీ డ్యాన్స్ షో కంటెస్టంట్స్ లీడర్ గా సుధీర్ తన సత్తా చాటుతున్నాడు. ఢీ 10 తర్వాత కొద్దిపాటి గ్యాప్ తోనే ఢీ జోడి మొదలైంది


ఇక ఈ షో జడ్జులుగా ఎప్పటిలానే శేఖర్ మాస్టర్ తో పాటుగా ప్రియమణి కంటిన్యూ అవుతున్నారు. ఇక ఈ స్టేజ్ మీద సుధీర్ కామెడీ కితకితలు పెడుతున్నాడు. సినిమాల్లో హీరోలు బ్రహ్మానందం ను పొగుడుతూ, తిడుతూ ఎలా కామెడీ చేస్తారో ఢీ షోలో కూడా సుధీర్ ను కూడా ఆడేసుకుంటున్నారు.


ముఖ్యంగా ఢీ యాంకర్ ప్రదీప్ సుధీర్ తో చేసే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. కొన్ని సార్లు కాస్త ఎక్కువ చేసినట్టు అనిపించినా కామెడీ మాత్రం అలరిస్తుంది. చూస్తుంటే బుల్లితెర బ్రహ్మానందంగా సుధీర్ తన కామెడీతో ఆకట్టుకుంటున్నాడు సుధీర్. ఢీ జోడి మొదటి ఎపిసోడ్ లో కూడా సుధీర్ కామెడీ బుల్లితెర ఆడియెన్స్ ను మెప్పించింది.


నందిని రెడ్డి గెస్ట్ గా వచ్చిన ఈ ఎపిసోడ్ అంతా ఫుల్ కామెడీగా నడిచింది. సుధీర్ పక్కన రష్మి బదులుగా బిగ్ బాస్ భాను శ్రీని తెచ్చేసరికి షో క్రేజ్ తగ్గినట్టు అనిపించినా సుధీర్ తన కామెడీతో మంచి హైప్ తెస్తున్నాడు. సో మొత్తానికి ఎప్పటిలానే ఢీ స్టేజ్ కూడా జబర్దస్త్ కామెడీ షోగా మారిందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: