అత్యంత భారీ అంచనాల మధ్య ఈవారం విడుదల అవుతున్న ‘అరవింద సమేత వీరరాఘవ’ ను ఇరుకున పెట్టాలనే కుట్ర జరిగిందని ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈకుట్రకు విజయ్ దేవరకొండ ‘నోటా’ ను పావుగా మార్చడానికి  చాలవ్యూహాత్మక పదకాలు రచించినట్లు ఆలస్యంగా వార్తలు వెలుగులోకి వచ్చాయి. 
anaganaganga song released from aravinda sametha movie
వాస్తవానికి ‘నోటా’ సినిమాను దసరా పండుగకు టార్గెట్ గా 18న విడుదల చేయాలని ఈమూవీ నిర్మాతలు భావించారు. అయితే అదే డేట్ కు దిల్ రాజ్ ‘హలో గురూ ప్రేమకోసమే’ విడుదల ఉన్న నేపధ్యంలో ఆమూవీ సోలో రిలీజ్ కోసం దిల్ రాజ్ రాజకీయం చేసి ‘నోటా’ నిర్మాతల పై ఒత్తిడి చేసి ఆమూవీ డేట్ ను ముందుకు వచ్చేలా చేయడం వెనుక ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ఉంది అన్న ప్రచారం జరుగుతోంది.

విజయ్ దేవరకొండకు ప్రస్తుతం ఉన్న క్రేజ్ రీత్యా ‘నోటా’ ను విడుదల చేస్తున్నప్పుడే ఈమూవీకి రెండు వారాలు అత్యధిక సంఖ్యలో ధియేటర్లు కావాలి అంటూ మొదటి వారానికి సంబంధించి డబ్బు కట్టి రెండవ వారానికి సంబంధించి కూడ ఎడ్వాన్స్ లు ఇచ్చినట్లు సమాచారం. ఒకవేళ ‘నోటా’ కు హిట్ టాక్  వచ్చి ఉంటే ఆమూవీ రెండవవారం కూడ మంచి ధియేటర్స్ లో రన్ అయ్యేలా పరిస్థుతులు ముందుగానే ఏర్పరుచుకుని ‘అరవింద సమేత’ కు ధియేటర్ల విషయంలో సమస్యలు ఎదురయ్యేలా జరిపిన ఈవ్యవహారం వెనుక ఇండస్ట్రీకి చెందిన ఒకప్రముఖ వ్యక్తి హస్తం ఉంది అన్న ప్రచారం జరుగుతోంది.

అయితే అదృష్టం కొద్దీ ‘నోటా’ కు ఫ్లాప్ టాక్ రావడంతో ఈఎత్తుగడ ఫలించలేదు. కానీ ‘అరవింద సమేత’ కు సంబంధించి 93కోట్ల బిజినెస్ జరగడంతో ఈమూవీ మొదటిరోజు మొదటి షో నుండి ఎటువంటి డివైడ్ టాక్ లేకుండా ఖచ్చితంగా పూర్తి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఈమూవీ బయ్యర్లు నష్ట పడకుండా బయటపడలుగుతారు. ఇలాంటి పరిస్థుతులలో జూనియర్ వ్యతిరేక వర్గం కొందరు ‘అరవింద సమేత’ పై మొదటిరోజు నుండి సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేయాలని ఇప్పటికే పక్కా ప్లాన్స్ రచించినట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. అందుకే ఈప్రమాదాన్ని ముందుగా ఊహించిన జూనియర్ త్రివిక్రమ్ లు నిన్నటి నుండి కలిసి ఛానల్స్ కు ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఈమూవీకి సంబంధించిన కథను నెమ్మదిగా లీక్ చేస్తూ ఈమూవీలోని హీరో పాత్ర స్వభావాన్ని ముందుగానే తెలియచేస్తూ ప్రేక్షకులకు ఎటువంటి నిరాశా కలగకుండా ముందునుంచే మానసికంగా సిద్ధం చేస్తున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: