కాస్టింగ్ కౌచ్ వ్యవహారం గురించి ఒక్కొక్కరు తమకు జరిగిన చేదు అనుభవాలను మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు . తాజాగా పూజా భట్ తనకు జరిగిన చేదు అనుభవాలను బయట పెట్టింది. జాగా నటి, దర్శకురాలు పూజా భట్ గతంలో ఓసారి ఎయిర్‌పోర్టులో తన స్నేహితుడి ద్వారా ఎదుర్కొన్న చేదు సంఘటన గురించి వెల్లడించారు. కోల్‌కతాలో జరిగిన 'ఇండియా టుడే ఎన్ల్కేవ్ ఈస్ట్ 2018' సదస్సులో పూజా భట్ తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. 

Image result for puja bhat

ఓసారి ఎయిర్ పోర్టులో నా స్నేహితుడు నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. అతడు నన్ను వేధిస్తూ నా వక్షోజాలు పట్టుకున్నాడు. ఆ సమయంలో నేను తీవ్రమైన మనోవేదనకు గురయ్యాను అని పూజా భట్ అన్నారు. మరో సందర్భంలో నా బాయ్ ఫ్రెండుతో రిలేషన్ షిప్‌లో ఉన్నపుడు అతడు నన్ను హింసించాడు. ఆ సమయంలో నేను అతడికి వ్యతిరేకంగా నా వాయిస్ రేజ్ చేశాను.

Image result for puja bhat

కానీ కొందరు నా చర్యను తప్పుబట్టారు. నీ పర్సనల్ విషయాలు జనాల్లోకి తేవద్దని వారు చెప్పడం నన్ను మరింత అసహనానికి గురి చేసింది.. అని పూజా గుర్తు చేసుకునప్నారు.బాలీవుడ్ లాంటి పరిశ్రమలో ఒక మహిళలకు అన్యాయం జరిగినపుడు సపోర్టు ఇవ్వడానికి చాలా మంది సంకోచిస్తారు. వేధింపులకు గురైన మహిళలకు నేను చెప్పేది ఒకటే. ఎవరికీ భయపడొద్దు. నిర్భయంగా వారిపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మహిళల పట్ల తప్పుగా ప్రవర్తించడానికి మగాళ్లు భయపడతారు అని పూజా భట్ అభిప్రాయ పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: