విజయ్ దేవరకొండ క్రేజీ హీరోగా మారినా అతడిని ఇప్పటి వరకు ఇండస్ట్రీలోని కొన్ని వర్గాలు తెలంగాణ సూపర్ స్టార్ గా మాత్రమే గుర్తిస్తూ వచ్చారు. టాప్ హీరోగా ఎదగాలి అంటే తెలంగాణతో పాటు ఆంధ్రా ప్రాంతానికి చెందిన అభిమానుల సపోర్ట్ కూడ చాల అవసరం అని గ్రహించిన విజయ్ దేవరకొండ చేసిన ప్రయత్నం మొదట్లోనే బెడిసి కొట్టడంతో ఆంధ్రా ప్రాంత ప్రేక్షకులు ప్రస్తుతం విజయ్ పై తీవ్ర అసహనాన్ని వ్యక్త పరుస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
vijay devarakonda taxi wala teaser Latest 2018 - Sakshi
ఆసక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే విజయ్ మొట్టమొదటి సారిగా విజయవాడకు వచ్చి తన ‘నోటా’ ను ప్రమోట్ చేయడమే కాకుండా ఆమూవీ ప్రమోషన్ ఫంక్షన్ లో ‘నోటా’ ఘన విజయం సాధిస్తుంది అని చెపుతూ విపరీతమైన అత్యుత్సాహంతో ‘నోటా’ సినిమా ఘన విజయం గురించి ప్రమాణం చేస్తున్నాను అంటూ భారీ మాటలు చెప్పి అంచనాలు పెంచాడు. అంతేకాదు తనకంటూ అభిమానులను ఆంధ్రా ప్రాంతంలో కూడ బాగా ఏర్పాటు చేసుకోవడానికి పెద్ద స్కెచ్ ని ‘నోటా’ ద్వారా అమలు చేయాలని ప్రయత్నించాడు. 
Vijay Devarakonda
అయితే ‘నోటా’ భయంకరమైన ఫ్లాప్ గా మారడంతో విజయ్ మాట తప్పాడు అంటూ కొందరు ఆంధ్రా ప్రాంత ప్రేక్షకులు విజయ్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. దీనితో ఒకసినిమా గురించి ఆసినిమాలో నటించిన హీరో అంచనాలు పెంచితే ఫలితం ఎలా ఉంటుందో కెరియర్ మొదటిదశలోనే విజయ్ కి తెలిసి వచ్చింది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 
Vijay Devarakonda emulates his contemporaries
‘నోటా’ ఫలితం తెలిసిపోవడంతో ఇప్పటికే రకరకాల సమస్యలు ఎదుర్కుంటున్న విజయ్ ‘టాక్సీ వాలా’ కు కూడ టెన్షన్ ఏర్పడింది. ఈసినిమా షూటింగ్ సంతృప్తికరంగా రాకపోవడంతో ఇప్పటికే ఈమూవీకి రీ షూట్ జరిగింది అన్నవార్తలు ఉన్నాయి. దీనికితోడు ఈసినిమా కథ అంతా చిన్నపిల్లల చుట్టూ తిరిగే ఒక ఫ్యాంటసీ కావడంతో ఇప్పటి వరకు విజయ్ నటించిన సినిమాలకు భిన్నంగా ‘టాక్సీ వాలా’ ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనితో ఈసినిమా ప్రమోషన్ విషయంలో తన రొటీన్ దూకుడును తగ్గించి తక్కువగా ప్రమోట్ చేసి ఈమూవీ పై భారీ అంచనాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అన్న సలహాలు విజయ్ కు అందుతున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: