‘బిగ్ బాస్ 2’ టైటిల్ విన్నర్ కౌశల్ క్రియేట్ చేస్తున్న సంచలనాలు ఎవరికీ అర్ధంకాని విషయంగా మారాయి. ప్రపంచ టెలివిజన్ చరిత్రలో ఒక రియాలిటీ షోకి సంబంధించి ఎవరికీరాని విధంగా 39.5 కోట్ల ఓట్లు సంపాదించుకుని కౌశల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ కు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ మ్యానియా ఇక్కడితో ఆగకుండా కౌశల్ కు ఒక అమెరికన్ యూనివర్సిటీ డాక్టరేట్ డిగ్రీ ఇస్తున్నట్లు ప్రకటించడం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది.
ఎవరు ఇస్తున్నారు?
ఈవిషయాన్ని స్వయంగా కౌశల్ లీక్ చేసాడు. ‘అభిమానులందరికీ ఒక గుడ్ న్యూస్. మీ బిగ్ బాస్ విన్నర్ కౌశల్‌ కు తొందరలో డాక్టరేట్ రాబోతోంది. ఎందుకు రాబోతోంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ విషయం నేను కొన్నిరోజుల తర్వాత చెబుతాను' అంటూ కౌశల్ చేసిన ట్విట్ వైరల్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు హార్వెస్ట్ బైబిల్ యూనివర్శిటీ నుండి కౌశల్ కు ఈ గౌరవం లభించబోతున్నట్లు సమాచారం. 
కౌశల్ ఫాలోయింగ్ చూసి అంతా షాక్
అమెరికాలో లాస్ ఏంజెల్స్ లోని హార్వెస్ట్ బైబిల్ యూనివర్శిటీ ఉంది. అయితే ఆ యూనివర్సిటీకి కౌశల్ మ్యానియా ఎలా తెలిసింది అన్న విషయమై అనేక అనుమానాలు ఉన్నాయి. ఇది చాలదు అన్నట్లుగా ‘బిగ్ బాస్ 2’ షో ముగిసిన తరువాత కౌశల్ అనేక షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి అతిధిగా వెళుతూ భారీ మొత్తాలను పారిషికంగా తీసుకుంటున్నట్లు టాక్. 
సస్పెన్స్‌లో పెట్టిన కౌశల్
ఈ మాల్స్ ఓపెనింగ్స్ సమయంలో కౌశల్ ను చూడటానికి విపరీతంగా జనం వస్తూ ఉండటంతో కౌశల్ తెలుగు రాష్ట్రాల్లో తన అభిమానుల కోరిక మేరకు విజయ యాత్రలు నిర్వహించబోతున్నాడు. ఈ విజయ యాత్రలు ద్వారా తన స్వచ్చంద సేవా సంస్థకు క్యాన్సర్‌తో బాధ పడుతున్న వారికి ఆర్థిక సహాయం అందించడానికి విరాళాలు సేకరించడంతో పాటు కౌశల్  విజయ యాత్ర వెనుక కనిపించని రాజకీయ కోణం ఉంది అన్న సందేహాలు కూడ కలుగుతున్నాయి. ‘బిగ్ బాస్ 2’ ముగిసిన తరువాత ఆషోలోని కంటెస్టెంట్స్ కనీసం తనకు ఫోన్ కూడ చేయడం లేదు అంటూ ఓపెన్ గానే కౌశల్ చెపుతున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో కౌశల్ కు వచ్చిన ఈ డాక్టరేట్ గౌరవాన్ని ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్స్ ఎలా జీర్ణించుకుంటారో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: