గతవారం కోలీవుడ్ లో విడుదలైన ‘96’ సినిమాకు అద్భుతమైన రివ్యూలు రావడమే కాకుండా ఈమూవీ తమిళనాడులో కలక్షన్స్ విషయంలో సృష్టిస్తున్న సునామి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. త్రిష సినిమా కెరియర్ అయిపోయింది అని అందరూ భావిస్తున్న సమయంలో ఈమూవీ త్రిష కెరియర్ కు మరో టర్నింగ్ పాయింట్ గా మారింది. 
Trisha and Vijay Sethupathi in 96.
దీనితో ఈమూవీ రీమేక్ రైట్స్ ఇప్పటికే చేజిక్కించుకున్న దిల్ రాజ్ ఈమూవీ రీమేక్ విషయంలో తన వేగాన్ని పెంచి ఈమూవీకి సంబంధించిన స్క్రిప్ట్ రైటింగ్ పనులను ప్రారంభించవలసిందిగా దిల్ రాజ్ తన దగ్గర ఉండే రైటర్స్ టీమ్ ను కోరినట్లు సమాచారం. 1996 కాలంనాటి పరిస్తుతులను గుర్తుకుచేసే విధంగా రూపొందిన ఈ రొమాంటిక్ కామెడి స్క్రిప్ట్ కు తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా చాల మార్పులు చేస్తున్నట్లు సమాచారం. 
Dil Raju. YouTube
ఇప్పటికే ఈమూవీని దిల్ రాజ్ నానీకి చూపించి అతడి నిర్ణయం గురించి వేచి చూస్తున్న నేపధ్యంలో నాని తన నిర్ణయం విషయంలో ఇంకా ఆలస్యం చేస్తే ఈమూవీకి సాయిధరమ్ తేజ్ ను కానీ లేదంటే శర్వానంద్ ను కాని హీరోగా ఫిక్స్ చేయాలని దిల్ రాజ్ ఎత్తుగడ అని అంటున్నారు. అయితే నానీకి ఈమూవీ కథ నచ్చినా తాను త్రిష పక్కన నటిస్తే బాగుండదు అని అభిప్రాయ పడుతూ వేరే హీరోయిన్ ను వెతకమని దిల్ రాజ్ కు చెప్పినా దిల్ రాజ్ త్రిష పట్ల పూర్తిగా ఇష్టపడుతున్న నేపధ్యంలో నాని అయోమయంలో పడిపోతున్నట్లు టాక్.
NANI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇప్పటికే నాని తన సినిమాల ఎంపిక విషయంలో తప్పటడుగులు వేస్తున్నాడు అని కామెంట్స్ వస్తున్న పరిస్థుతులలో ‘96’ మూవీ రీమేక్ విషయంలో ఎటూ తేల్చుకోలేని అయోమయంలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘బిగ్ బాస్ 2’ షో షాక్ నుండి బయటపడ్డ నాని ఇప్పుడు తన దృష్టి అంతా ‘జెర్సీ’ సినిమా పైనే పెట్టి మరొక ప్రయోగం జోలికి వెళ్లకూడదని స్థిరమైన నిర్ణయంలో ఉన్నాడు అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: