ప్రముఖ దర్శకులు సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్, సమంత నటించిన ‘రంగస్థలం’ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మాస్ దర్శకులు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రాంచరణ్ నటిస్తున్న చిత్రానికి ఇంకా టైటిల్ ఖారారు చేయలేదు.  ఆ మద్య చిరు పుట్టిన రోజుకి ఫస్ట్ లుక్ వస్తుందని భావించారు..తర్వాత వినాయక చవితికి కూడా నిరాశ పరిచారు.  బోయపాటి శ్రీను అదిరిపోయే మాస్ ఎంటర్ టైనర్ ని తెరకెక్కిస్తున్నా మెగా ఫాన్స్ మాత్రం నిరాశలోనే ఉన్నారు.   ఈ చిత్రం ప్రారంభమై చాలా కాలం గడుస్తున్నా ఇంతవరకు టైటిల్ కూడా ప్రకటించలేదు.

ఈ నేపథ్యంలో దసరాకు ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. అయితే రాంచరణ్ చిత్రానికి బాబాయి పవన్ కళ్యాన్ నటించిన మూవీ టైటిల్ పెట్టాలే ఆలోచనలో ఉన్నారట చిత్ర యూనిట్.  పవన్ కళ్యాన్ పీక్ స్టేజ్ లో ఉన్నసమయంలో ‘తమ్ముడు’చిత్రం మంచి విజయం అందుకుంది.  సెంటిమెంట్ తో పాటు కామెడీ, యాక్షన్ ఈ చిత్రానికి బాగా కలిసి వచ్చాయి. దాంతో పవన్ కళ్యాన్ స్టార్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.   కాగా, రాంచరణ్ చిత్రానికి తమ్ముడు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కథ పరంగా రాంచరణ్ కొంత మంది సోదరులకు తమ్ముడు కావడంతో ఈ టైటిల్ పరిశీలిస్తున్నట్లు ఫిలిం నగర్ లో టాక్.అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్ కలసిఉండేలా కూడా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే స్టేట్ రౌడి అంటూ ఫ్యాన్స్ మేడ్ పోస్టర్లు కూడా చక్కర్లు కొట్టాయి. 

రాంచరణ్ సరసన ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఆర్యన్ రాజేష్, సీనియర్ హీరోయిన్ స్నేహ కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల అజార్బైజాన్ దర్శకుడు భారీ యాక్షన్ సన్నివేశాన్ని రాంచరణ్ పై చిత్రీకరించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: