విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం డైరక్షన్ లో వచ్చిన సినిమా గీతా గోవిందం. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు నిర్మించిన ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న వారం మధ్యలో రిలీజైన ఈ సినిమా వసూళ్ల సునామి సృష్టించింది.


పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాల తర్వాత విజయ్ సత్తా చాటిన గీతా గోవిందం ఏకంగా 100 కోట్ల గ్రాస్ కలక్షన్స్ తో అతన్ని స్టార్ హీరోని చేసింది. ఇక గీతా గోవిందం ఫైనల్ గా వరల్డ్ వైడ్ గా 68.20 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. కేవలం 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ రో రిలీజైన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కు ఒక వంతుకి మూడింతలు లాభాలు తెచ్చి పెట్టినదని తెలుస్తుంది.


గీతా గోవిందం సక్సెస్ లో విజయ్ దేవరకొండ, రష్మికలతో పాటుగా దర్శకుడు పరశురాం టాలెంట్ కూడా మెచ్చుకోదగినదని చెప్పొచ్చు. ఇంతకుముందు అతను తీసిన శ్రీరస్తు శుభమస్తు సినిమా కూడా మంచి హిట్ సాధించింది. ఇక ఏరియాల వారిగా గీతా గోవిందం కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే...


నైజాం : 19.60 కోట్లు
సీడెడ్ : 6.90 కోట్లు
ఉత్తరాంధ్ర : 6 కోట్లు
ఈస్ట్ : 3.80 కోట్లు
వెస్ట్ : 3.16 కోట్లు
కృష్ణా : 3.67 కోట్లు
గుంటూర్ : 3.80 కోట్లు
నెల్లూరు : 1.72 కోట్లు
ఏపి/ తెలంగాణా : 48.65 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 8.30 కోట్లు
ఓవర్సీస్ : 11.25 కోట్లు
వరల్డ్ వైడ్ : 68.20 కోట్లు  


మరింత సమాచారం తెలుసుకోండి: