‘అరవింద సమేత’ మూవీని ప్రమోట్ చేస్తూ జూనియర్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాప్ డైరెక్టర్స్ కు విసిరిన సవాల్ ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఆ ఇంటర్వ్యూను నిర్వహిస్తున్న ఆమీడియా సంస్థ ప్రతినిధి జూనియర్ ను కార్నర్ చేయడానికి ఒక ప్రశ్న అడిగాడు. 
 రాముడిలా ఉండాలి, వీరుడు అయుండాలి
ప్రస్తుతం మల్టీ స్టారర్ మూవీల హవా నడుస్తోంది కాబట్టి మహేష్ రామ్ చరణ్ జూనియర్ లతో ఎవరైనా మూవీ చేయాలని ప్రయత్నిస్తే అంగీకరిస్తారా అన్న ప్రశ్నకు జూనియర్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.  ఎవరైనా ముందుగానే ఆలోచించుకుని భారీ ప్లాన్స్ వేసుకుని సినిమాలు చేస్తే అవి గ్యారెంటీ సక్సస్ అవుతాయి అన్న నమ్మకాలు లేవని అయినా ఎవరైనా టాప్ దర్శకుడు తమ ముగ్గురుని మెప్పించగల కథతో సినిమాను తీయగలిగితే తాను అలాంటి భారీ మల్టీ స్టారర్ లో నటించడానికి రెడీ అంటూ సంకేతాలు ఇచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచాడు.  
 పేలడానికి సిద్దంగా ఉన్న బాంబు లాంటి పాత్రలో
ఇదే సందర్భంలో జూనియర్ మాట్లాడుతూ త్వరలో ప్రారంభం కాబోతున్న రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మల్టీ స్టారర్ పై తన దృష్టికి వచ్చిన కొన్ని విచిత్ర కామెంట్స్ ను బయట పెట్టాడు. త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ మల్టీ స్టారర్ వేర్వేరు సామాజిక వర్గాల హీరోల కాంబోగా చూస్తు కొంతమంది ఏకంగా తనకు తెలిసేలా కామెంట్స్ పెట్టడం చూస్తుంటే తనకు వింతగా అనిపించడమే కాకుండా కళకు సామాజిక వర్గాలు ఏమిటి అన్న ఆలోచనలు వచ్చి తన మైండ్ కొన్ని గంటల పాటు బ్లాంక్ అయిపోయింది అంటూ దిగజారిపోతున్న విలువల పై తన తీవ్ర ఆవేదన వ్యక్త పరిచాడు జూనియర్. 
నా స్వార్థం కూడా ఉందన్న ఎన్టీఆర్
ఇదే సందర్భంలో ‘అరవింద సమేత’ లో తన పాత్రకు సంబంధించిన సిక్స్ ప్యాక్ లుక్ గురించి మాట్లాడుతూ ఈసినిమాకు సంబంధించి సిక్స్ ప్యాక్ అవసరం ఉన్న ఒక సీన్ ఉండటంతో ఆసీన్ కోసం షర్ట్ లేకుండా నటించాను అంటూ బలవంతంగా జనాలకు తన బాడీ చూపించడం తన ఉద్దేశం కాదు అంటూ జూనియర్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇది ఇలా ఉండగా ఈమూవీ విడుదల కాకుండానే ఈసినిమా వల్ల నిర్మాతలకు 40 కోట్ల లాభం వచ్చింది అని వస్తున్న వార్తలు సంచలనాలను సృష్టిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: