ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు మూడు పదులు దాటినా..పెళ్లి ముచ్చట అస్సలు తీసుకు రావడం లేదు. పైగా ఈ టైమ్ లో మంచి గ్లామర్ గా కనిపిస్తూ..కెరీర్ ని చక్కదిద్దుకుంటూ ఇబ్బడి ముబ్బడిగా డబ్బు సంపాదిస్తున్నారు.  దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సూక్తిని కొంత మంది హీరోయిన్ల తూ.చ.తప్పకుండా పాటిస్తున్నారు.  కాజల్, త్రిష, నయన్ ఇలా కొంత మంది హీరోయిన్ల ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు దాటినా ఇంకా గ్లామర్ మెయింటేన్ చేస్తూ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. 

ఇక 90వ దశకంలో హీరోగా, విలన్ గా నటించి ప్రస్తుతం తండ్రి, మామ పాత్రల్లో నటిస్తున్న హీరో శరత్ కుమార్ అందరికీ తెలిసిందే.  ఈయన ప్రముఖ నటి రాధికను పెళ్లి చేసుకున్నారు.  అయితే మొదటి భార్య కూతురు నటి వరలక్ష్మి ప్రస్తుతం హీరోయిన్ గా కొనసాతుంది.  ఆ మద్య తమిళ హీరో విశాల్, నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేమలో పడ్డారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనీ కొన్నాళ్లుగా వదంతులు వినిపిస్తున్నాయి.  కాగా ఈ విషయంపై వరలక్ష్మి శరత్ కుమార్ స్పందించింది.

వరలక్ష్మి శరత్ కుమార్ స్పందించింది. అయితే పెళ్లి విషయాన్ని మా పెద్దలు చూసుకుంటారని..ప్రస్తుతం కెరీర్ పై దృష్టి పెట్టానని..తన కెరీర్ బాగానే కొనసాగుతుందని అన్నారు.  సినీ పరిశ్రమలో ఇలాంటి వదంతులు సృష్టించి, తనను కిందకు లాగాలని చూస్తున్న వారందరికి తన ధన్యవాదాలంటూ సెటైర్లు వేసింది. ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్ పైనే ఉందని.. తన కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుందని చెప్పింది. ‘పందెంకోడి-2’, ‘మారి 2’, ‘సర్కార్’, ‘శక్తి’, ‘నీయ 2’ చిత్రాల్లో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: