తెలుగు ఇండస్ట్రీలోకి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన ‘సూపర్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క తర్వాత అగ్ర హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది.  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అనుష్క ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించింది.  మొదట్లో గ్లామర్ పాత్రల్లో నటించిన అనుష్క తర్వాత కోడీ రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అరుంధతి’ చిత్రం తర్వాత పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించింది.  బాహుబలి 2 తర్వాత భాగమతి చిత్రంలో నటించిన అనుష్క తర్వాత ఏ చిత్రంలో కనిపించలేదు.  


ఇదిలా ఉంటే.. అనుష్కకి సంబందించిన వార్తలు ఆసక్తికరంగా మారుతున్నాయి.  అన్ని రకాల పాత్రలకు సూటయ్యే అతికొద్దిమంది సౌత్ హీరోయిన్లలో అనుష్క ఒకరు. గ్లామర్ పత్రాలు, చారిత్రాత్మక నేపథ్యం ఉన్న పాత్రలు, లేడి ఓరియెంటెడ్ చిత్రాలు ఇలా అన్ని విధాలుగా అనుష్క భాగమతి చిత్రం వరకు దూసుకుపోయింది.   అయితే ఆ మద్య గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తుందని అన్నారు..కానీ ఆ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. మరోవైపు అనుష్క కుటుంబ సభ్యులు ఆమె పెళ్లి విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 


సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ జరుగుతోంది. అనుష్క సినిమాలకు దూరం కాబోతోందంటూ వార్తలు అధికం అవుతున్నాయి. అంతే కాదు ఆ మద్య  అనుష్క దోష నివారణార్థం అనేక పూజలు నిర్వహించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనుష్క వయసు 36 ఏళ్ళు. ఆమె కుటుంబ సభ్యులు అనుష్కకు పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మాధవన్ సరసన ఓ చిత్రంలో నటించబోతోందంటూ వార్తలు వినిపించాయి. ఈ రెండు చిత్రాలకు సంబందించిన ఊసే ఎక్కడా వినిపించడం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: