అక్టోబర్ 11న రిలీజ్ కాబోతున్న ఎన్.టి.ఆర్ అరవింద సమేత సినిమాకు సంబందించి ఓ అదిరిపోయే న్యూస్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఈ సినిమాను ఏపిలో 6 షోలు వేసేందుకు పర్మిషన్ సంపాదించారు. రిలీజ్ డే నుండి అక్టోబర్ 18 వరకు అరవింద సమేత సినిమాను సెలెక్టెడ్ థియేటర్స్ లో రోజుకి 6 షోలు వేసేలా రంగం సిద్ధం చేశారట.


ఉదయం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు రోజు వేసే నాలుగు ఆటల షోకు అదనంగా మరో రెండు షోలు వేయనున్నారట. త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ అరవింద సమేత సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటించారు. 


ఏపిలో 6 షోలు కాబట్టే తెలంగాణాలో కూడా 5 షోలకు పర్మిషన్ తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాల కోసం అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తారు. అందుకే వారి కోసం రోజుకి 6 షోలను వేసేస్తున్నారట. ఇక ఏపి, తెలంగాణాలో టికెట్ ప్రైజ్ కూడా పెంచేసినట్టు తెలుస్తుంది.


ఏపిలో 200, తెలంగాణాలో 120 రూపాయలుగా టికెట్ ప్రైజ్ నిర్ణయించారు. ప్రైజ్ రేటు కూడా సెలెక్టెడ్ థియేటర్ తో పాటుగా ఏదైతే వారం రోజులు 6 షోలు ఏర్పాటు చేశారో అప్పటివరకు ఇవే అమలు కానున్నాయట. 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వస్తున్న అరవింద సమేత సినిమా లెక్కకుమించి షోలు పడటం వల్ల కచ్చితంగా రికార్డ్ వసూళు రాబెడుతుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: