ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ విడుదలకు సిద్ధం అయ్యింది అయితే నిన్న ఈ సినిమా కు సెన్సార్ పూర్తయింది సినిమా చూసిన సభ్యులు త్రివిక్రమ్ మార్క్ కనిపించిందని డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయని కితాబు ఇచ్చారంటా... ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ప్రి రిలీజ్ బిజినెస్‌ కూడా భారీ ఎత్తున జరిగింది.

ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ మూవీ రూ. 92 కోట్ల బిజినెస్ సాధించిందని ట్రేడ్ అనలిస్ట్‌లు లెక్కలు కడుతున్నారు. సీడెడ్ థియేట్రికల్ రైట్స్, డిస్ట్రిబ్యూషన్, ఓవర్సీస్ ప్రి రిలీజ్ కలుపుకుని ఊహించని స్థాయి బిజినెస్ రాబట్టింది ఈ మూవీ. అయితే భారీ బడ్జెట్ మూవీ కావడంతో రూ. 140 కోట్ల రాబడితే బ్లాక్ బస్టర్ లిస్ట్‌లో అరవింద సమేతకు స్థానం దక్కుతుంది. ప్రస్తుతం ఈ మూవీ పాజిటివ్ బజ్ ఉండటంతో ఈ మార్క్‌ను అందుకోవడం ఎన్టీఆర్‌కు పెద్ద కష్టమేమీ కాదు.

పైగా థియేటర్స్‌లో పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడం కూడా ఎన్టీఆర్‌కి కలిసివచ్చే అంశమే.  ఇక ఈ లెక్కలు సంగతి పక్కనబెడితే.. ఈ నెల 11న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని కొద్దిసేపటి క్రితం U/A సర్టిఫికేట్‌ను అందుకుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే, ఈషా రెబ్బాలు హీరోయిన్స్‌గా నటించారు. జగపతి బాబు ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. నాగబాబు ఎన్టీఆర్ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: