ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉదాంతం గురించి ఒక్కొక్కరు నోరు మెదుపుతున్నారు తమకు ఎదురైనా చేదు అనుభవాలను మీడియా ముందు బయట పెడుతున్నారు. హీరోయిన్ తనుశ్రీ తద్ద నానా పాటేకర్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో బాలీవుడ్ లో మహిళలపై లైంగిక వేధింపుల గురించి హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. రవీనా టాండన్, కంగనా రనౌత్ ఇలా ప్రముఖ హీరోయిన్లంతా మీటూ క్యాంపైన్ మొదలు పెట్టి వారికి ఎదురైన లైంగిక వేధింపులని బట్టబయలు చేస్తున్నారు. తాజగా ఈ జాబితాలోకి ఓ మహిళా జర్నలిస్ట్ కూడా చేరింది. ప్రముఖ బాలీవుడ్ సింగర్ కైలాష్ ఖేర్ పై సంచలన ఆరోపణలు చేసింది.

ఇంటర్వ్యూ కోసం వెళితే

నటాషా సోషల్ మీడియా వేదికగా తనకు జరిగిన లైంగిక వేధింపులని బయట పెట్టింది. తాను ప్రముఖ ఆంగ్ల పత్రికలో ఫోటో జర్నలిస్ట్ గా 2006 లో పనిచేశా. ఆ సమయంలో కైలాష్ ఖేర్ తో ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూ చేయడానికి తనతో పాటు మరో మహిళా జర్నలిస్ట్ కూడా వచ్చింది. నేను ఫొటోగ్రాఫ్స్ తీయాలి.

ఖండించిన కైలాష్

ఇంటర్వ్యూ జరిగే సమయంలో కైలాష్ మా ఇద్దరి మధ్యలో కూర్చున్నాడు. కొంత సమయానికి కైలాష్ తన తొడలపై నెమ్మదిగా చేతులు వేయడం ప్రారంభించారు. చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. అతడు చేస్తున్న నీచమైన పనిని నాతో వచ్చిన మరో జర్నలిస్ట్ కూడా గమనించింది. అతడి లైంగిక వేధింపులకు మేదిద్దరామే సాక్షులం. అతడు చేసిన నీచమైన పని గురించి వార్త రాయాలని నాతో వచ్చిన జర్నలిస్ట్ కు సూచించాను. ఇలాంటి వాటి గురించి రాయకపోవడమే మంచిది. సైలెంట్ గా ఉండు అంటూ వారించింది. ఆ సమయంలో అతడిని తానేమి చేయలేకపోయానని నటాషా ట్విట్టర్ వేదికగా పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: