యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అరవింద సమేత సినిమా రిలీజ్ కు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. అక్టోబర్ 11 రిలీజైనా ఒకరోజు ముందు నుండి ఈ సినిమా సందడి షురూ కానుంది. రికార్డుల లెక్క తేల్చేలా దసరా బుల్లోడిగా వస్తున్న వీర రాఘవ విధ్వాంసానికి సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమా రన్ టైం ఎంత అంటే 2 గంటల 40 నిమిషాల దాకా ఉంటుందని తెలుస్తుంది.


ఎన్.టి.ఆర్, త్రివిక్రం 12 ఏళ్లుగా ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్న కాంబినేషన్ ఇది.. అలాంటి కాంబోలో అద్భుతమైన అంచనాలతో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ తో శాంపిల్ గా సినిమా రుచి చూపించారు. చాలా రోజుల తర్వాత కత్తి పట్టిన ఎన్.టి.ఆర్ ఈ సినిమాతో మరోసారి విజృంభించడం ఖాయమని తెలుస్తుంది.


హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ఈషా రెబ్బ, సునీల్ కూడా సినిమాలో స్పెషల్ రోల్ లో కనబడుతున్నారు. ఈమధ్య స్టార్ సినిమాల రన్ టైం పై ఆడియెన్స్ దృష్టి పెట్టడం లేదు. కంటెంట్ ఉంటే నిడివి అటు ఇటుగా ఉన్నా సరే సూపర్ హిట్ చేసేస్తున్నారు.


ఇక ఏపిలో అరవింద సమేతకు 6 షోలు వేసుకునేలా పర్మిషన్ ఇవ్వగా తెలంగాణాలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణలో కూడా 5 షోలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: