ఇప్పుడు హాలీవుడ్ లో ‘మీటూ’ఉద్యమం ఏ రేంజ్ లో కొనసాగుతుందో అందరికీ తెలిసిందే.  ఈ నేపథ్యంలో బాలీవుడ్..కోలీవుడ్, టాలీవుడ్ లోనే కాదు పలు సినీ ఇండస్ట్రీలో ‘మీటూ’ఎఫెక్ట్ బీభత్సంగా పడింది.  గతంలో తమకు ఎదురురైన చేతు అనుభవాలు ఒక్కొక్కరూ..మీడియా సాక్షిగా బయటకు తీసుకు వస్తున్నారు.   ఈ నేపథ్యంలో  బాలీవుడ్‌లో ‘మీటూ’ ప్రకంపనలు కొనసాగుతున్నాయి.  సినీ, మీడియా రంగాల్లో వరసగా ఒక్కొక్కరు తమ భయంకరమైన అనుభవాలను  బహిరంగంగా మాట్లాడుతున్నారు.  తాజాగా ప్రముఖ రచయిత, ప్రొడ్యూసర్‌ వింటా నందా తన అనుభవాన్ని సోషల్ మీడియా సాక్షింగా బహిర్గతం చేశారు. 
alok nath new
హృదయ విదారకమైన  అనుభవాన్ని రెండు దశాబ్దాల తన మూగ వేదనను షేర్‌ చేశారు.  సినీ, టీవీ టెలివిజన్‌ నటుడు అలోక్‌నాథ్‌ తనపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడని  వింటా నందా ఆరోపించారు.  బలవంతంగా మద్యం తాగించి మరీ అలోక్‌నాథ్‌  రేప్‌ చేశాడని 20 ఏళ్ల సంఘటనను గుర్తు చేసుకున్నారు.   90వ దశకంలో టెలివిజన్ స్టార్‌గా  వెలుగు వెలిగిన  ఆయన అప్పటి టీవీ షో తారా  ప్రధాన నటిని కూడా లైంగికంగా వేధించాడనీ,  దీనిపై ఫిర్యాదు  చేసినందుకుగాను ఆమెను షో నుంచి తొలగించారన్నారు. 

ఇన్నాళ్లు తాను మౌనంగా ఉండడం వల్ల పరిస్థితులు మరింత ఘోరంగా మారాయి.  ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక్కొక్కరూ తమ వ్యక్తిగత విషయాలు చెప్పడం వల్ల వారికి జరిగిన అన్యాయాలపై పోరాటం కొనసాగించడానికి సహనటులు ముందుకు వస్తున్నారని అన్నారు.  లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేస్తున్న బాధిత మహిళలను అభినందించిన  వింటా ఇదే  సరైన సమయం మీరు ఎదుర్కొన్న వేధింపులపై గొంతెత్తి అరవండి ఆమె ఆవేదన తెలియజేశారు.  మరోవైపు  ఈ ఆరోపణలపై స్పందించిన సినీ, టీవీ ఆర్టిస్టుల సంఘం (సీఐఎన్‌టీఏఏ) అలోక్‌నాథ్‌కు నోటీసులు జారీ  చేసింది.  వింటా నందా ఆరోపణలపై వివరణ యివ్వాల్సిందిగా  కోరింది.



మరింత సమాచారం తెలుసుకోండి: