ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో వరుసగా బయోపిక్ చిత్రాలు వస్తున్న విషయం తెలిసిందే.   మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన ‘మహానటి’సూపర్ హిట్ అయ్యింది.  ప్రస్తుతం ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ జీవితకథ ఆధారంగా చేసుకొని ‘యాత్ర’చిత్రాలు వస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఆ మద్య ఏపీ సీఎం చంద్రబాబు జీవితకథ ఆధారంగా చంద్రబాబు బయోపిక్ అంటూ తీస్తున్నారంటూ తెగ సందడి చేశారు.  ఈ చిత్రానికి ‘చంద్రోదయం’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.  అంతే కాదు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో ఈ చిత్రంపై రక రకాల కామెంట్స్ వినిపించాయి.  ఓ పక్క క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్టీఆర్ ’ బయోపిక్ చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ తో ఫ్యాన్స్ లో ఎంతో ఉత్సాహం పెరిగిపోతుంది.

 ఈ చిత్రంలో ఎన్టీఆర్ తో అనుబంధం ఉన్న చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తున్నాడు.  ఫస్ట్ లుక్ లో అచ్చం చంద్రబాబు ని తలపించేలా ఉంది.   అయితే ఎన్టీఆర్ బయోపిక్ రేంజ్ లో ‘చంద్రోదయం’చిత్రాన్ని ఊహించుకున్న తెలుగు దేశం తమ్ములు, కార్యకర్తలకు షాకింగ్ ఇచ్చేలా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.  సదరు ఫస్ట్ లుక్స్ & పోస్టర్ చూసినవాళ్ళందరూ “ఇది బయోపిక్ ఫిలిమా లేక స్పూఫ్ తీస్తున్నారా?” అని సందేహపడ్డారు.  ఇండస్ట్రీలో ఏ మాత్రం పేరు లేని వ్యక్తి  డూప్స్ తో సినిమా షూటింగ్ చేయడంతో తెలుగుదేశం తమ్ముళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక సీనియర్ ముఖ్యమంత్రి మీద తీసే సినిమా ఆయన ఇమేజ్ కు గౌరవాన్నిచ్చేలా ఉండాలి అని అంటున్నారు.  ఈ బయోపిక్ చంద్రబాబు ని నవ్వులపాలు చేసేలా ఉండకూడదు అని భావించిన టి.డి.పి వర్గాలు ఉన్నపళంగా ఆ సినిమా షూటింగ్ ఆపేయాలని సదరు దర్శకనిర్మాతలు టీడీపీ హై కమాండ్ ఆర్డర్లు జారీ చేశారట. కాగా, ఈ సినిమా తమ అభిమాన నేతపై తీస్తున్నదని చెప్పినా..వద్దని విమర్శలు రావడంతో షూటింగ్ ఆపినట్లు సమాచారం..మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు..కానీ టీడీపీ నేతలు, కార్యక్తలు మాత్రం ఊపిరి పీల్చుకున్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: