అల్లు అర్జున్ భార్య  స్నేహారెడ్డి ఇప్పటివరకు తెలుగులో ఏ స్టార్ హీరో భార్య సాధించని గౌరవాన్ని సంపాదించుకుని సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడమే కాకుండా క్వీన్ ఆఫ్ సోషల్ మీడియా అనే ట్యాగ్ పొందడం సంచలనంగా మారింది. స్నేహారెడ్డి ఈ ఘనత సాధించడానికి గల మూలకారణం ఇన్‌స్టాగ్రామ్. గత కొన్ని నెలలుగా ఇన్‌స్టాగ్రామ్‌ లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్న స్నేహారెడ్డి 1మిలియన్ ఫాలోయర్స్‌ను పొందడం షాకింగ్ న్యూస్ గా మారింది. 
సౌత్ నెం.1... ఇండియాలో నెం.2
సినిమాల్లో నటించకుండా ఎటువంటి కళలలోను రాణించకుండా కేవలం స్టార్ హీరో వైఫ్ హోదాలో ఇంత ఫాలోయింగ్ సాధించడం ఒక రికార్డు అని అంటున్నారు. సౌత్ ఇండియాలో ఏస్టార్ హీరో భార్యకు ఇంత ఫాలోయింగ్ లేదు. అయితే దేశవ్యాప్తంగా పరిగణలోకి తీసుకుంటే స్నేహారెడ్డి కంటే ముందు స్థానంలో బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్ పుత్ కొనసాగుతోంది. 
 స్నేహారెడ్డికి ఎందుకింత ఫాలోయింగ్?
వాస్తవానికి అల్లు అర్జున్ స్టార్ ఇమేజ్‌తో సంబంధం లేకుండా స్నేహా రెడ్డి తన ఇన్‌స్టా పోస్టులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంచేసింది. ఆమె షేర్ చేసే పోస్టులలో చాలా మటుకు బన్నీ అయాన్ అర్హకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఉండటంతో ఈమె షేర్ చేసే పోస్టులను అదేవిదంగా వీడయోలను విపరీతంగా అభిమానులు చూసారు. 
బన్నీ కెరీర్లో కూడా కీలక పాత్ర
మహేష్ భార్య నమ్రత రామ్ చరణ్ వైఫ్ ఉపాసనలు కూడ సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా కొనసాగుతూ ఉన్ననా ఉపాసన బిజినెస్ ఉమెన్ గా ఎన్నో అవార్డులు ఇప్పటికే అందుకున్నా  వారిద్దరి క్రేజ్ కన్నా స్నేహారెడ్డి క్రేజ్ ముందు స్థాయిలో ఉండటం అత్యంత ఆశ్చర్యకరం.  బన్నీ వ్యక్తిగత జీవితంలో స్నేహారెడ్డి పాత్ర అత్యంత కీలకమైన నేపధ్యంలో బన్నీ సినిమా విషయాలకు కూడ తనవంతు సహాయం అందించడానికి స్నేహా రెడ్డి ప్రస్తుతం బన్నీకి సంబంధించిన సినిమా కథలను కూడ వింటూ తనవంతు సలహాలను ఇస్తున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: