త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలను ప్రమోట్ చేస్తూ విడుదలకు ముందు ఎప్పుడు అంతగా మీడియా ముందుకు రాడు. అలాంటి పద్ధతికి భిన్నంగా త్రివిక్రమ్ నిన్న తన ‘అరవింద సమేత’ విడుదల సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమూవీ ఫలితం గురిచి చేసిన కొన్ని కామెంట్స్ ఈ మూవీ బయ్యర్లకు కలవరం పుట్టిస్తున్నాయి.
అరవింద సమేతలో రాయలసీమను గొప్పగా
‘అరవింద సమేత’ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందా ? అంటూ ఒక మీడియా సంస్థ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు త్రివిక్రమ్ తనదైన రీతిలో సమాధానం ఇచ్చాడు. ఈమూవీ గ్యారెంటీ సూపర్ హిట్ అని తాను ఖచ్చితంగా చెప్పలేనని అయితే అదేవిధంగా ఈసినిమా అందరికీ నచ్చదు అని కూడ తాను చెప్పనని విజయానికి సంబంధించిన ఏవిషయం తన చేతిలో లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 
ఎన్టీఆర్‌కు నాలుగు కథలు చెప్పా
ఎంతటి గొప్ప వ్యక్తి అయినా ప్రజా తీర్పుకు తల వంచాలని ఈమూవీ ప్రేక్షకులకు నచ్చినా నచ్చకపోయినా ఏవిషయం తన చేతిలో లేదు అని అంటూ వాస్తవాలను గుర్తించ వలసిన పరిస్థుతులు ఎవరికైనా ఏర్పడతాయి అంటూ త్రివిక్రమ్ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఈ కామెంట్స్ ఈమూవీ పై అత్యంత భారీ అంచనాలు పెట్టుకున్న బయ్యర్లకు అదేవిధంగా జూనియర్ అభిమానులకు అయోమయాన్ని సృష్టిస్తున్నాయి.
సుప్రియా పాథక్‌‌ను అందుకే తీసుకొన్నాం
ఇదే సందర్భంలో త్రివిక్రమ్ మరో ట్విస్ట్ ఇస్తూ ఒక సినిమా విజయవంతం అయితే తాను నెలరోజులు ఆనంద పడతానని ఫెయిల్ అయితే తాను ఆ బాధను పది రోజులు మాత్రమే గుర్తుంచుకుంటాను అంటూ తనలోని వాస్తవిక దృక్పదాన్ని బయటపెట్టాడు. కొద్దిరోజుల క్రితం జూనియర్ ఈమూవీ గురించి మాట్లాడుతూ ‘అరవింద సమేత’ ఒక మంచి సినిమా అన్న దృష్టిలో నటించాను కాని రికార్డుల గురించి కాదు అని కామెంట్స్ చేసిన తరువాత ఇప్పుడు ఇలా త్రివిక్రమ్ ఈమూవీ ఫలితం తన చేతిలో లేదు అంటూ చేతులు ఎత్తేయడంతో సుమారు వందకోట్ల బిజినెస్ జరిగిన ఈమూవీ పరిస్థితి ఏమిటి అంటూ కొందరు త్రివిక్రమ్ కామెంట్స్ పై వ్యతిరేక అర్ధాలను ప్రచారం చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: