‘అరవింద సమేత’ మ్యానియాతో ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీ హోరెత్తి పోతున్న నేపధ్యంలో దుబాయ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు ‘అరవింద సమేత’ ను చూసి ఇచ్చిన రివ్యూ జూనియర్ అభిమానులను జోష్ లో ముంచెత్తి వేస్తోంది. ఈమూవీకి సంబంధించిన సెన్సార్ కాపీ చూసిన తరువాత ఉమైర్ ఈరివ్యూ ఇచ్చాడు. 
ఎన్టీఆర్ లుక్, క్యారెక్టరైజేషన్ మేజర్ హైలెట్
‘అరవింద సమేత’ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పడమే కాకుండా ఏకంగా 4/5 రేటింగ్ ఇచ్చి సంచలనాలు సృష్టించాడు. ఈ సినిమాలో మేజర్ హైలెట్ ఎన్టీఆర్ లుక్, క్యారెక్టరైజేషన్ అని యంగ్ టైగర్ స్క్రీన్ ప్రజెన్స్ సినిమా చూస్తున్న వారిలో మరింత ఆసక్తి పెంచుతుంది అంటూ ఈమూవీ పై అంచనాలు పెంచుతున్నాడు.   
 త్రివిక్రమ్ అదరగొట్టాడు
ముఖ్యంగా ఈమూవీ క్లైమాక్స్‌ లో ఎన్టీఆర్ క్యారెక్టర్‌ ను బ్యాలెన్స్ చేసిన తీరు అద్భుతంగా ఉంది అని అంటూ ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ డైలాగ్ మాడ్యులేషన్ ఈమూవీలో పీక్స్ లో కనిపిస్తుంది అంటూ ఈమూవీ పై ఈ క్రిటిక్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం జూనియర్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ డైలాగ్స్ కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని ఉమైర్ సంధు అభిప్రాయ పడుతున్నాడు.
అరవింద సమేత 4/5 రేటింగ్
ఈమూవీకి గుండెకాయగా త్రివిక్రమ్ సమకూర్చిన అద్భుతమైన స్క్రీన్ ప్లే ఉంది అని అభిప్రాయ పడుతూ గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే చేత కూడ త్రివిక్రమ్ అద్భుతంగా నటింప చేసాడు అని అంటున్నాడు. ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ మాస్ స్టోరీ హై యాక్షన్ ఎపిసోడ్స్ సూపర్ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ ఈసినిమాకు మూల స్తంభాలుగా మారుతాయని ఉమైర్ అభిప్రాయం. అయితే ఉమైర్ సంధు గతంలో ఇలాంటి అద్భుతమైన రివ్యూలు ఇచ్చిన ‘బ్రహ్మోత్సవం’ ‘అజ్ఞాతవాసి’ ‘నాపేరు సూర్య’ సూపర్ ఫ్లాప్ లుగా మారిన నేపధ్యంలో అసలు ఫలితం వచ్చే వరకు ఈ క్రిటిక్ రివ్యూను పూర్తిగా నమ్మలేని స్థితిలో జూనియర్ అభిమానులు ఉన్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: