అక్టోబర్లో పుట్టిన వాళ్లంతా మహనీయులు కాకపోవచ్చు. కాని చాలా మంది మహనీయులు అక్టోబర్లోనే పుట్టారు. అలాంటి 1973 అక్టోబర్లో ఇదే రోజున (10 వ తారీఖు) జన్మించిన దిగ్దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి నిరభ్యంతరంగా మహనీయుడే. 


తెలుగు సినీ రంగం (టాలీవుడ్) లో ఒక సినిమా వసూళ్ళు ఎక్కువలో ఎక్కువగా ₹ 40 - ₹ 50 కోట్ల మద్య మూలిగే కాలం లోనే బాలీవుడ్ లో బిగ్ బీ తో పాటు   ఖాన్ త్రయం గా పిలవబడే సల్మాన్, షారూక్, ఆమీర్ వసూళ్ళను ₹ 100 కోట్లకుపైనే లిఖించారు. అలాంటి స్థితిలో ₹ 100కోట్ల క్లబ్ కోసం మొహం వాచిన టాలీవుడ్ ని ₹ 1700 కోట్ల వసూళ్ళ తెరం దాటించిన ఏకైక ఘనుడు దిగ్ధర్శకుడు మాత్రమే. అప్పటికే ఖాన్ త్రయం బిక్క మొహం వేయక తప్పింది కాదు! అసూయతో ఆమీర్ ఒక్కసారి కూడా బాహుబలి పేరు తలవనైనా తలవలేదట. 
Image result for rajamouli movies
"కాపీ డైరెక్టర్" అంటూ ముద్ర వేసినా, దృశ్యాలకు దృశ్యాలే కాపీ చేస్తాడని నిందవేసినా, సినిమా వాల్-పోస్టర్లు సైతం కాపీ చేస్తాడని దూషించినా, కథలు కాపీ చేస్తాడని బహువిధాలుగా వేదించినా సృజన ప్రయాణాన్ని విజయవంతంగా ముందుకు నడిపించటం ఆయన  మాత్రం  ఆపలేదు. అంతే కాదు తను నమ్మిన విధానంతో, టేకింగ్ స్ట్రాటజీతో కదులుతూ ప్రపంచం తనవైపు ధిగ్గున చూసేలా చేసి తానెంతటి ధీరుడో ఈ జగాన ఇప్పటి వరకు మరొకరులేరు అని నిరూపించిన రాజమౌళి ధన్యుడు. 
Image result for rajamouli movies
బాలీవుడ్ ప్రఖ్యాత సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తమ సినీ పరిశ్రమ లోని దర్శక, నిర్మాత, హీరోలకు ఒక సూచన చేశారు. " బాహుబలిని - దర్శకధీరుడు రాజమౌళిని చూసి నేర్చుకోవాలి. బాహుబలి మార్కెటింగ్ స్ట్రాటజీని మనం అనుసరించాలి. ఇదో గొప్ప నేర్చుకుని తీరాల్సిన పాఠం - అంతే కాదు సినిమా రంగానికే బాహుబలి ఒక పాఠం" అని సినిమా రంగంలో ఆరితేరిన ఘనులకు ఇదో కేస్ స్టడీ అంటూ ఇంకెందరో కొనియాడిన సందర్భాన్ని ట్విట్టర్ ద్వారా బహిరంగంగా బలంగా ప్రపంచానికి చాటి చెప్పాడు. 
Image result for rajamouli movies
అందమైన చంద్రబింబంలో మచ్చలున్నట్లే రాజమౌళి సినిమాలో కూడా ఆయనకు సినీ ఙ్జానం నేర్పిన గురువుల ప్రభావమే కాదు,  చూసి తనను తన్మయానికి గురిచేసిన సినీ సన్నివేశాల ప్రభావం ఉండటం కూడా కాపీ అనేదానికి దారి తీయవచ్చు. అలాంటప్పుడు  "కాపీ డైరెక్టర్" అని అతితేలికగా తీసిపారేయలేం కదా! ఇప్పుడు రాజమౌళి నుండి వచ్చే సినిమా ఏదనేది సరిగా తెలియక పోయినా ఆ సినిమా కోసం సగటు ప్రేక్షకుడే కాదు బాలీవుడ్ తో సహా ప్రాంతీయ సినీపరిశ్రమలన్నీ పరిశీలనగా ఎదురు చూస్తున్నాయి. క్రేజు అంటే ఆయనదే. ఈగో అంటే ఆయనదే. ఆద్యంతం లేని విజయాల  సమాహారం ఎవరు సాధిస్తే వారికి కొంచెం ఈగో ఉండచ్చు. అదే వారికి ఆభరణం. అందుకు రాజమౌళి మినహాయింపు కాదు అందుకే ఆయనకు హ్యాట్సాఫ్.

Image result for rajamouli movies

అనేది సినిమా మాత్రమే కాదు ఒక జాతి యావత్తూ నిర్మించిన అద్భుత చిత్రాల చారిత్రాత్మకత సమగ్ర స్వరూపమే బాహుబలి.  బాహుబలి అనే సినీ దృశ్య చరిత్ర లిఖించిన ఎస్ ఎస్ రాజమౌళికి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది ఏపి హెరాల్డ్.....ప్రపంచానికే మరి కొన్ని సినిమా నిర్మాణ మెళుకువలతో, సృజనాత్మక వ్యాపార స్ట్రాటజీస్  తో మరిన్ని కొత్త పాఠాలు రాజమౌళి నేర్పాలని ఆశిస్తుంది ఏపి హేరాల్డ్.  

Image result for rajamouli movies

మరింత సమాచారం తెలుసుకోండి: