టాలీవుడ్ లో ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు హీరో రామ్.  ఆ మద్య వరుసగా ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న సమయంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా వచ్చిన ‘నేను శైలజా’తో మంచి సక్సెస్ అందుకున్నాడు.  ఈ మద్య  ఉన్నది ఒక్కటే జిందగీ సినిమా తరువాత ఎనర్జిటిక్‌ యంగ్ హీరో రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా హలో గురూ ప్రేమకోసమే. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్నాడు. యాక్షన్ తో కూడిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ నటించింది.


ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను దసరా కానుకగా ఈ నెల 18వ తేదీన విడుదల చేస్తున్నారు.  ప్రమోషన్‌ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్న చిత్రయూనిట్ ఆడియోను కూడా డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి విడుదల చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ, లవ్ .. సెంటిమెంట్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ సీన్స్ పై ఈ ట్రైలర్ మంచి అంచనాలే పెంచుతున్నాయి.  రామ్ ఎనర్జీ, అనుపమా, ప్రణీతల క్యూట్‌ పర్ఫామెన్స్‌తో ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది. 


"స్కూల్ అయినా .. కాలేజ్ అయినా .. ఆఫీస్ అయినా కొత్తగా జాయిన్ అయిన ఫస్టు డే అందరూ చేసే ఫస్టు పనేంటో తెలుసా? అమ్మాయిల్లో ఎవరు బాగున్నారా అని అబ్బాయిలు, అబ్బాయిల్లో ఎవరు బాగున్నారా అని అమ్మాయిలు ఏరుకోవడం".. "అబద్ధాలు చెబితే అమ్మాయిలు పుడతారోలేదో తెలియదు గానీ, అబద్ధాలు చెబితే మాత్రం అమ్మాయిలు కచ్చితంగా పడతారు" వంటి డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటు న్నాయి.


యూత్ హృదయాలను కొల్లగొట్టే సీన్స్ ఈ సినిమాలో కావాల్సినన్ని ఉన్నాయనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్న హలో గురు ప్రేమ కోసమే సినిమాలో ప్రకాష్‌రాజ్‌లు మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: