టాలీవుడ్ హీరోలు చాలామంది  మన పొరుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తమిళనాడులో తమ మార్కెట్‌ను విస్తరించుకోవాలని  ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నారు. అయితే కొంత వరకు మలయాళ సినిమా మార్కెట్ లో అల్లుఅర్జున్ లాంటి ఒకరిద్దరు హీరోలకు మార్కెట్ వచ్చింది కానీ తమిళంలో మాత్రం మార్కెట్ తెచ్చుకోవడానికి మన హీరోలు ఎన్ని  ప్రయత్నాలు  చేస్తున్నా అవి ఫలించడం లేదు.
SPYder Movie Review
దీనితో  ఈ వ్యవహారం పరిశీలిస్తున్న చాలా మంది మన హీరోల పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కిగా కనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.   వాస్తవానికి  అల్లు అర్జున్ తమిళంలో ఒక డైరెక్ట్ సినిమా చేయాలనుకున్నాడు. కానీ అది వర్కవుట్ కాలేదు. ఇక మహేష్ ఎంతో ప్లాన్ చేసి మురుగదాస్ లాంటి అగ్ర తమిళ దర్శకుడితో ‘స్పైడర్’ చేసి తమిళ సినిమా రంగంలో తన సత్తా చాటాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ఆదిలోనే బెడిసి కొట్టాయి .
NOTA movie review,NOTA review,NOTA movie rating
ఇలాంటి   పరిస్థితులలో  ‘అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’ సినిమాలతో  తమిళనాడులో కూడా క్రేజ్ ఏర్పడటంతో  ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకుందామని విజయ్ దేవరకొండ  దర్శకుడు ఆనంద్ శంకర్  దర్శకత్వంలో  నటించిన  ద్విభాషా చిత్రం ‘నోటా’ తమిళనాడులో కూడా ఘోరమైన ఫ్లాప్ గా మారింది.  వాస్తవానికి ఈ సినిమాను తమిళ రాజకీయాల  నేపధ్యంలో తీసినా ఈ మూవీ ని తమిళ ప్రేక్షకులు పూర్తి గా తిరస్కరించారు.
NOTA Movie Review
ఈ  మూవీకి తమిళనాడులో కనీస  కలెక్షన్స్ కూడా రాక పోవడంతో మన హీరోలు ఎవ్వరికీ తమిళ మార్కెట్ కలిసిరావడం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా   ‘నోటా' పరాజయాన్ని అంగీకరిస్తూ విజయ్ దేవరకొండ మీడియాకు విడుదల చేసిన ఒక లెటర్ సంచలంగా మారింది. తన  సినిమా చూడటానికి వెళ్లినవారికి ఈ సినిమా చూసి అసంతృప్తికి గురైన వారిని ఉద్దేసించి రాసిన ఈ లెటర్ లో ఈ మూవీ పరాజయానికి సమంధించి తాను   రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను అంటూ ఈ సినిమాతో తన పట్ల  అసంతృప్తిగా ఉన్న వారిని మెప్పించడానికి మరింత కష్టపడతాను అంటూ అయితే  తన  యాటిట్యూడ్ మారదు  అంటూ మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: