యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న నందమూరి ఫ్యాన్స్ ఆన్ లైన్ లో టికెట్లు అలా పెట్టారో లేదో అలా బుక్ చేసుకుంటున్నారు. భారీ అంచనాల నడుమ వస్తున్న అరవింద సమేత వీర రాఘవ 100 కోట్లు కలెక్ట్ చేయడం పక్కా అంటున్నారు సిని విశ్లేషకులు.


ఎన్.టి.ఆర్ వరుస సూపర్ హిట్లతో ఫాంలో ఉండటమే కాకుండా దసరా బరిలో స్టార్ సినిమా పోటీగా లేకపోవడం కూడా కలిసి వచ్చే అంశమే. ఇక ఎన్.టి.ఆర్ అరవింద సమేత మీద కేవలం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు సిని ప్రియులు కూడా చూడాలన్న ఆసక్తితో ఉన్నారు. దసరాకి వారం ముందు వస్తున్న అరవింద సమేత ఊరు వాడా అనే తేడా లేకుండా మ్యాక్సిమం అన్ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.


యూఎస్ లో మరికొద్ది సేపటిలో ప్రీమియర్స్ మొదలనున్నాయి. మొదటి రోజు రికార్డులు కూడా భారీగా ఉంటాయని తెలుస్తుంది. మొదటి రోజే ఎక్కువ మొత్తాన్ని రాబట్టి వీకెండ్ కల్లా 100 కోట్లు తెచ్చే సినిమాగా అరవింద సమేత అవుతుందని అంచనా వేస్తున్నారు. సినిమాకు వచ్చిన హైప్ కు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా చాలు సినిమా సంచలనాలు సృష్టించినట్టే.


90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అవుతున్న అరవింద సమేత నాలుగు రోజుల్లో ఎక్కువ మొత్తాన్ని రాబట్టాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఏపిలో ఎలాగు 6 షోలు కాబట్టి వసూళ్ల సునామి పక్కా అని తెలుస్తుంది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాడు. ఫుల్ రన్ లో 200 కోట్లు దాటే అవకాశం కూడా ఉందని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.  



మరింత సమాచారం తెలుసుకోండి: