ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి, కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ కీలకపాత్రలలో కనిపిస్తున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం జార్జియాలో యుద్ధ సన్నివేశాలను భారీ బడ్జెట్ తో తెరక్కిస్తున్నారు. సైరా చిత్ర యూనిట్ సెట్ చేసుకున్న షెడ్యూల్స్ లలో ఇదే అతిపెద్ద షెడ్యూల్. వందల మంది సెట్ లో రోజు బిజీ బిజీగా గడుపుతున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలనీ చూస్తున్నాడు. 40రోజుల పాటు ఈ దేశంలో జ‌ర‌గ‌నున్న‌ భారీ వార్ సీక్వెన్స్ ఎపిసోడ్‌లో 300 గుర్రాలు,150 మంది జూనియ‌ర్ ఆర్టిస్ట్స్‌తో పాటు కొంత మంది సీనియ‌ర్ స్టార్స్ పాల్గొంటున్న‌ట్టు స‌మాచారం.  


50 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కే ఈ ఫైట్ సీక్వెన్స్‌లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆర్మీ.. బ్రిటిషర్స్‌తో యుద్ధానికి దిగుతుంది. హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ ఈ ఫైట్‌ని తెర‌కెక్కించ‌నున్నారు. ఈ ఫైట్ కోసం స్లోవ‌కియా నుండి ప్ర‌త్యేకంగా 3డీ ఫ్లైయింగ్ కెమెరా తెప్పించిన‌ట్టు తెలుస్తుంది.  ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సుదీప్ కిచ్చా కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారిద్దరూ షూటింగ్ స్పాట్ లో ఒక ఫొటో దిగగా అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వారి పాత్రలు సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయి.  


విజయ్, సుదీప్ గెటప్ అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా ఈ చిత్రంలో విజయ్, నరసింహారెడ్డి నమ్మిన బంటు ఓబయ్య అనే పాత్రలో కనిపిస్తుండగా.. సుదీప్ అవకు రాజగా నటించనున్నాడు.  ఈ చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న నయనతార, తమన్నా, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ హిస్టారికల్ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: